Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

7 ఏళ్ల క్రితం గుడిలో చోరీ అయిన మీ బూట్లను గుర్తించడానికి స్టేషన్ కు రండి.. ఫిర్యాదుదారుడికి పోలీసుల ఫోన్

Spread the love

మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఒక అసాధారణ సంఘటన జరిగింది. ఏడేళ్ల క్రితం గుడి బయట చోరీకి గురయిన బూట్ల జతను గుర్తించడానికి పోలీసులు ఫిర్యాదుదారుడికి ఫోన్ చేసి పిలిచారు.
ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన మహేంద్ర కుమార్ దూబే దాదాపు ఏడేళ్ల క్రితం రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లాలోని సన్వారియా సేఠ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో అతని బూట్లు చోరీకి గురయ్యాయి. దీంతో జనవరి 14, 2017న మన్సఫియా పోలీస్ స్టేషన్ లో అతను లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని అలాగే వదిలేశారు.

Highlights

అయితే, కొద్ది రోజుల క్రితం, మహేంద్ర దూబేకి పోలీసు స్టేషన్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఆలయంలో చోరీ అయిన కొన్ని జతల బూట్లు స్వాధీనం చేసుకున్నట్లు కానిస్టేబుల్ ఖుబ్‌చంద్ అతనికి కాల్ చేసి చెప్పాడు. వారిలో తన బూట్లను గుర్తించాలని కోరారు.
ఈ కాల్ వెనుక కారణం ఏమిటంటే.. అదే ఆలయం వద్ద జడ్జి కొడుకు బూట్లు కూడా చోరీకి గురయిన గురించి గురించి దూబే ఒక వార్తాపత్రికలో చదివాడు. వెంటనే ఏడేళ్ల క్రితం జరిగిన తన బూట్ల దొంగతనానికి సంబంధించిన పాత దరఖాస్తును జతచేసి పోలీస్ స్టేషన్‌కు లేఖ రాశాడు. ఈ లేఖ ఆధారంగా, దూబే తన బూట్లు గుర్తించడానికి పోలీసు స్టేషన్ నుంచి తాజాగా కాల్ వచ్చింది.

కొసమెరుపు ఏంటంటే.. ఇప్పుడు, దూబే తన బూట్లను తిరిగి తీసుకునేందుకు పోలీస్ స్టేషన్‌కి వెళ్లాలంటే బూట్ల విలువ కంటే ప్రయాణ ఖర్చులే ఎక్కువ ఖర్చవుతాయి..


మానసిక దివ్యాంగులు, వృద్ధులు, చిన్నపిల్లలు తప్పిపోయిన సందర్భాల్లో బాధితుల కుటుంబాలతో సంప్రదించేందుకు కొత్తగా వచ్చిన QR కోడ్- కలిగిన లాకెట్ 

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *