ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష 

ఏడేళ్ల  బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష 
Spread the love

గత ఏడాది ఏడున్నరేళ్ల బాలికపై అత్యాచారం చేసి అతికిరాతకంగా హత్య చేసిన కేసులో దోషిగా తేలిన 22 ఏళ్ల కామాంధుడికి హర్యానా(Haryana)లోని కైతాల్‌(Kaithal)లోని కోర్టు శనివారం మరణశిక్ష విధించింది. దోషి, పవన్ కుమార్ అలియాస్ మోని, ఊరగాయల వ్యాపారి.

కాగా పవన్ కుమార్ కు మరణశిక్ష విధిస్తూ కోర్టు దీనిని అరుదైన కేసుల్లో అరుదైన కేసుగా పేర్కొంది. “ఇలాంటి అసహ్యకరమైన, హేయమైన చర్యకు పాల్పడే వ్యక్తికి జీవించే హక్కు లేదు” అపరాధి బాలికపై క్రూరంగా ప్రవర్తించిన తీరు సహించలేనిది.” అని అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి గగన్‌దీప్ కౌర్.. ఉరి శిక్షను ఖరారు చేస్తూ వ్యాఖ్యానించారు.
జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా మృతురాలి కుటుంబీకులకు రూ.30 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రత్యేక పోక్సో కోర్టు ప్రకటించింది .

READ MORE  Delhi | బిర్యానీకి డబ్బు ఇవ్వలేదని యువకుడిని 60 సార్లు పొడిచి చంపిన 16 ఏండ్ల కుర్రాడు

“దాడి క్రూరత్వం, చనిపోయిన చిన్నారిపై అత్యాచారం, హత్య, దహనం చేసిన అనాగరిక విధానం, తల్లిదండ్రులు అనుభవించిన మానసిక వేదనను పరిగణనలోకి తీసుకుంటే, మరణశిక్ష తప్ప మరే ఇతర శిక్ష ఏదీ సరిపోదని కోర్టు గుర్తించింది” అని న్యాయమూర్తి చెప్పారు. .

బాలల రక్షణ చట్టం (పోక్సో)లోని సెక్షన్ 6, ఐపీసీ సెక్షన్ 302, సెక్షన్ 365పై సెక్షన్ 366, సెక్షన్ 201పై 10 ఏళ్లు, ఏడేళ్ల జైలుశిక్ష(Imprisonment)తోపాటు కోర్టు ఉరిశిక్ష, 13,000 జరిమానా విధించినట్లు. జిల్లా డిప్యూటీ అటార్నీ జై భగవాన్ గోయల్ తెలిపారు. .

READ MORE  దామోహ్ స్కూల్ పై బుల్డోజర్ చర్య

గత ఏడాది అక్టోబర్ 8న ఈ కేసు నమోదైందని, ఐపీసీ, పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని గోయల్ తెలిపారు.

కలయత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన నిందితుడు పవన్ కుమార్ వీధిలో ఆడుకుంటున్న 2వ తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సాయంత్రానికి బాధితురాలి కుటుంబ సభ్యులు బాలిక కోసం గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరుసటి రోజు ఉదయం, ఆమె కాలిపోయిన స్థితిలో మృతదేహాన్ని సమీపంలోని అడవిలో కనిపించింది. సీసీ కెమెరాల సాయంతో కుమార్‌ని పట్టుకున్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్‌ సజ్జన్‌కుమార్‌ నేతృత్వంలోని పోలీసులు అతడిని అరెస్టు చేశారు. విచారణలో, తాను బాలికపై అత్యాచారం చేశానని, ఆమె గొంతు నులిమి హత్య చేసి, సాక్ష్యాలను నాశనం చేయడానికి ఆమె శరీరంపై పెట్రోల్ పోసి కాల్చినట్లు కుమార్ అంగీకరించాడు. మెడికల్ ఎవిడెన్స్చ DNA శాంపిల్స్ ఆధారంగా పవన్ కుమార్ కుమార్‌పై అభియోగాలను రుజువు కావడంతో దోషిగా గుర్తించారు. ఈ కేసులో 34 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు నమోదు చేసింది.

READ MORE  నుహ్ లో నేడు వీహెచ్ పీ శోభాయాత్ర : అనుక్షణం టెన్షన్.. టెన్షన్.. భారీ భద్రత, ఇంటర్నెట్ బంద్, 144 సెక్షన్ అమలు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *