ఆ నగరంలో ఆటో డ్రైవర్లు తమ ప్రయాణికులకు 30శాతం డిస్సౌంట్ ఇస్తున్నారు. ఎందుకో తెలుసా..

ఆ నగరంలో ఆటో డ్రైవర్లు తమ ప్రయాణికులకు 30శాతం డిస్సౌంట్ ఇస్తున్నారు. ఎందుకో తెలుసా..
Spread the love

గుజరాత్‌లోని సూరత్‌లోని సుమారు 1,000 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు ఆదివారం  తమ వినియోగదారులకు డిస్కౌంట్ ఆఫర్ ను అందిస్తున్నారు. ఆటో రిక్షా డ్రైవర్ల ఈ ఉదారతకు కృతజ్ఞతలు తెలిపిన గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ  మాట్లాడుతూ.. సూరత్ లో  “1,000 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు ప్రధాని మోదీ పుట్టినరోజు (Pm Modi Birthday)న 30 శాతం తగ్గింపును ప్రకటించారు. అలాగే ప్రధాని మోదీ 73వ పుట్టినరోజున 73 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు 100 శాతం తగ్గింపును అందిస్తున్నసందర్భంగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని బీజేపీ నేత అన్నారు. auto-drivers discounts to passengers

READ MORE  Video : మద్యం మత్తులో రైలు పట్టాలపై లారీ నడిపిన డ్రైవర్‌.. తర్వాత ఏం జరిగిందంటే?

వెయ్యి మంది డ్రైవర్లు 30 శాతం తగ్గింపుతో పాటు, 73 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు 100 శాతం తగ్గింపును అందించి మోదీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఫలితంగా ఈ రోజు వారి ప్రయాణికులకు ఉచిత రైడ్‌లను అందిస్తారు.
ప్రధానమంత్రి పుట్టినరోజున, బిజెపి ‘సేవా పఖ్వారా’ (Sewa Pakhwara) అనే రెండు వారాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది, ఈ సందర్భంగా సభ్యులు రక్తదాన శిబిరాలు, స్వచ్ఛత డ్రైవ్‌లు, వైద్య శిబిరాలు వంటి సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటారు.

READ MORE  ప్రేమికుడి కోసం 2 ఏళ్ల కొడుకునే చంపేసింది..

ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి మోడీ తన పుట్టినరోజున, తన ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం “PM విశ్వకర్మ” ను ప్రారంభించనున్నారు, ఈ సందర్భంగా కళాకారులు, హస్తకళాకారులు, సంప్రదాయ చేతివృత్తులవారికి రుణసాయం అందించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *