
Pune Porsche Crash | సుప్రీంకోర్టు పర్యవేక్షణతో విచారణ జరగాలి. పుణె ప్రమాద బాధితుల తల్లిదండ్రుల డిమాండ్..
Pune Porsche Crash | జబల్పూర్: పూణెలో కారు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల తల్లిదండ్రులు ఈ కేసులో దర్యాప్తు, విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణను మహారాష్ట్రలో కాకుండా బాధితులు ఉన్న మధ్యప్రదేశ్‌లోనే జరపాలని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.మే 19న పూణె నగరంలో 17 ఏళ్ల బాలుడు మద్యం సేవించి పోర్స్చే కారు అతివేగంగా నడిపి మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో మధ్యప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్స్.. అనీష్ అవధియా, అశ్విని కోష్టా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణమైన యువకుడితోపాటు తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశ్విని జబల్‌పూర్‌కు చెందినవారు కాగా, అనీష్ ఉమారియా జిల్లాలోని బిర్సింగ్‌పూర్ పాలికి చెందినవారు.అశ్విని తండ్రి సురేష్ కుమార్ కోష్ట పిటిఐతో మాట్లాడుతూ, "మాకు న్యాయం జరిగేలా ఈ కేసులో...