QR code-enabled Pendants : మానవ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఆధునిక టెక్నాలజీ పరిష్కార మార్గాలను చూపిస్తోంది. జ్ఞాపకశక్తి కోల్పోయిన, మానసిక దివ్యాంగులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైనా పొరపాటున ఇంటి నుంచి తప్పిపోయిన సందర్భాల్లో బాధితుల కుటుంబాలతో సంప్రదించేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. వారి సొంత చిరునామా గురించి చెప్పుకోలేరు.. అలాంటివారి కోసం కొత్తగా వచ్చిన ఈ ప్రత్యేకమైన ఆవిష్కరణ QR కోడ్- కలిగిన లాకెట్టు. చక్కగా ఉపయోగపడుతుంది. బాధితరులు తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకోవడంలో ఈ లాకెట్ సాయపడుతుంది.
దివ్యాంగులు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు (senior citizens) రోజువారీ జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొంటారు. ఒక్కోసారి వారు తమను తాము మరచిపోతుంటారు. ప్రత్యేకించి వారు తమ ఇళ్ల నుండి బయటికి వచ్చినప్పుడు, కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు దారితప్పిపోయే ప్రమాదాలు ఎదురవుతాయి. వీరి ఆచూకీ కనుగొనడం కుటుంసభ్యలుకు ఆందోళన కలిస్తుంది. అయితే ఇలాంటి సమస్యకు చెక్ పెట్టేందుకు 24 ఏళ్ల డేటా ఇంజనీర్, అక్షయ్ రిడ్లాన్ అభివృద్ధి చేసిన QR కోడ్ పెండెంట్లు ఎంతగానో ఉపయోగపడతాయి.
మానసిక వైకల్యం, వైద్యపరమైన అత్యవసర పరిస్థితులతో బాధపడుతున్న వారి కోసం QR కోడ్-ఆధారిత పెండెంట్‌లను అందించేందుకు చేతన (Project Chetna) ప్రాజెక్ట్ చేపట్టారు. దీని ద్వారా బాధితులు వారి కుటుంబాలను సులభంగా చేరుకోవచ్చు.
ఎవరైనా లాకెట్టులో కస్టొమైజ్డ్ QR కోడ్‌లను స్కాన్ చేసినప్పుడు, అది ధరించిన వ్యక్తికి సంబంధించిన ప్రాథమిక వివరాలను అందిస్తుంది. వివరాలలో పేరు, ఫోన్ నెంబర్లు, చిరునామా వివరాలు, బ్లడ్ గ్రూప్ వంటివి ఉంటాయి.
అల్జీమర్స్ వ్యాధి(Alzheimers), మానసిక వైకల్యం, స్కిజోఫ్రెనియా(schizophrenia) లేదా ఆటిజం(autism)తో బాధపడుతున్న పిల్లలతో సహా అనేక కారణాల వల్ల ఇంటి నుండి దూరంగా వెళ్లేవారిని, ఇంటికి తిరిగి వెళ్లలేని వ్యక్తులకు QR pendant ఎక్కువగా ఉపయోడుతుంది.
ఈ టెక్-ఎనేబుల్డ్ లాకెట్టు(tech-enabled pendant) ఒంటరిగా పాఠశాలకు వెళ్లే పిల్లలకు ఉపయోగించుకోవచ్చు. ఈ QR కోడ్ పెండెంట్లు భారతదేశం అంతటా అందుబాటులో ఉంటాయి.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి.
తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, స్పెషల్ స్టోరీస్, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.
ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.