తప్పిపోయిన వారిని సురక్షితంగా ఇంటికి తిరిగి రప్పించే QR కోడ్- పెండెంట్లు
QR code-enabled Pendants : మానవ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఆధునిక టెక్నాలజీ పరిష్కార మార్గాలను చూపిస్తోంది. జ్ఞాపకశక్తి కోల్పోయిన, మానసిక దివ్యాంగులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైనా పొరపాటున ఇంటి నుంచి తప్పిపోయిన సందర్భాల్లో బాధితుల కుటుంబాలతో సంప్రదించేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. వారి సొంత చిరునామా గురించి చెప్పుకోలేరు.. అలాంటివారి కోసం కొత్తగా వచ్చిన ఈ ప్రత్యేకమైన ఆవిష్కరణ QR కోడ్- కలిగిన లాకెట్టు. చక్కగా ఉపయోగపడుతుంది. బాధితరులు తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకోవడంలో ఈ లాకెట్ సాయపడుతుంది.దివ్యాంగులు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు (senior citizens) రోజువారీ జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొంటారు. ఒక్కోసారి వారు తమను తాము మరచిపోతుంటారు. ప్రత్యేకించి వారు తమ ఇళ్ల నుండి బయటికి వచ్చినప్పుడు, కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు దారితప్పిపోయే ప్రమాదాలు ఎదురవుతాయి. వీరి ఆచూకీ కనుగొనడం కుటుంసభ...