Home Career Skill University Admission | స్కిల్ యూనివ‌ర్సిటీలో అడ్మిషన్స్ షురూ..

Skill University Admission | స్కిల్ యూనివ‌ర్సిటీలో అడ్మిషన్స్ షురూ..

0
7
Skill University Admission
Spread the love

Skill University Admission | తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (Skill University) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ  దసరా పండుగ నుంచే స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇటీవలే అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే స్కిల్ యూనివర్సిటీలో కొన్ని కోర్సులలో ప్రవేశాల కోసం  నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

మొదటి విడతగా యూనివర్సిటీ మూడు స్కూల్స్‌ను, వాటిల్లో నాలుగు కోర్సులను ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, హెల్త్ కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్‌ను ఈ ఏడాది నుంచే ప్రారంభించనున్నారు. వీటిల్లో లాజిస్టిక్స్ అండ్ ఈ -కామర్స్ స్కూల్ కింద వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్, కీ కన్సయినర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు, హెల్త్‌కేర్‌లో భాగంగా ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్సలెన్స్, ఫార్మాష్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ కింద ఫార్మా అసోసియేట్ ప్రోగ్రామ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.

ఈ కోర్సుల్లో చేరాలనుకునే అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 29 లోగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ (https://yisu.in/) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. నవంబర్ 4 వ తేదీ నుంచి ఈ కోర్సులు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (క్యాంపస్‌లలో తాత్కాలికంగా ఈ కోర్సులను నిర్వహించ‌నున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

 

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here