IRCTC recruitment 2024 : భారీ వేతనంతో రైల్వే మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు.. కేవలం ఇంటర్వ్యూతోనే ఎంపిక
IRCTC Job Alert : దేశవ్యాప్తంగా ప్రయాణీకులకు సేవలందిస్తున్న భారతీయ రైల్వేలో భారీ వేతనంతో కూడిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఖాళీలు ప్రముఖ రైల్వే టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన IRCTCలో ఉన్నాయి. IRCTC, ఒక ప్రభుత్వ రంగ సంస్థ, భారతీయ రైల్వేలకు టికెటింగ్, క్యాటరింగ్, టూరిజం సేవలను అందిస్తోంది. 1999లో స్థాపితమైన ఐఆర్ సీటీసీ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. 66 మిలియన్లకు పైగా వినియోగదారులు IRCTCలో నమోదు చేసుకున్నారు, ప్రతిరోజూ సుమారు 7.31 లక్షల టిక్కెట్లను బుక్ చేస్తున్నారు.రైల్వే ఉద్యోగాలు కోరుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం. ముఖ్యంగా, రాత పరీక్ష లేదు.. నేరుగా ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక. ఇంటర్వ్యూలో బాగా రాణిస్తే ఈ ఉద్యోగం మీదే..
ఖాళీలు:
IRCTC అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM), డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM), డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)తో సహా వివిధ మేనేజర్ స్థానాలక...