PM Vishwakarma Yojana : హస్తకళాకారులు, చేతివృత్తుల వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నిరుపేద చేతి వృత్తులారికి తక్కువ వడ్డీతో రుణాలు అందించడమే కాకుండా వారిలో వృత్తి నైపుణ్యలను పెంచి, మార్కెటింగ్ లోనూ మద్దతునిచ్చేందుకు కేంద్రం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఐదేళ్ల కాలానికి రూ.13,000 కోట్ల వ్యయంతో ప్రధానమంత్రి ‘విశ్వకర్మ యోజన’ పేరుతో కొత్త పథకానికి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.
ఆగస్టు 15న తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ సెప్టెంబర్‌లో విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రధాని మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే..కాగా ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల పై కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వేలు, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు.
18 రకాల వృత్తులకు..
ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకం కింద కళాకారులు, చేతివృత్తుల వారికి ఐడీ కార్డు అందజేస్తారు. మొదటి విడతలో 5 శాతం వడ్డీతో రూ.1 లక్ష వరకు రుణం, రెండవ విడతలో రూ. 2లక్షలు రుణం అందిస్తారు. స్కిల్ అప్‌గ్రేడేషన్, టూల్‌కిట్ ఇన్సెంటివ్, డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకం,
మార్కెటింగ్ సపోర్ట్‌ను కూడా ఈ పథకం అందిస్తుందని మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మొదటి దశలో 18 రకాల వృత్తులవారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. స్వర్ణకారులు, వడ్రంగిలో వడ్రంగి, పడవలు తయారు చేసేవారు, కంచర, కమ్మరి, సుత్తి, పనిముట్లను తయారు చేసేవారు, తాళాలు తయారు వేసేవారు, కుమ్మరి, శిల్పి, రాళ్లను పగలగొట్టేవాడు, చెప్పులు కుట్టేవాడు, తాపీ మేస్త్రీ, బుట్ట/చాప/చీపురు మేకర్/ మేదరి పనిచేసేవారు. , బొమ్మలు & బొమ్మలు తయారు చేసేవాడు, బార్బర్, గార్లాండ్ మేకర్, రజకులు, టైలర్, ఫిషింగ్ నెట్ మేకర్ ఈ పథకం కిందికి వస్తారని మంత్రి వెల్లడించారు.
రూ.500 ఉపకారవేతనం, పరికరాల కొనుగోలుకు రూ.15,000
ఈ పథకం కింద రెండు శిక్షణ కార్యక్రమాలను తీసుకురానున్నట్టు మంత్రి వెల్లడించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న వారికి రోజుకు రూ.500 ఉపకార వేతనంతో మెరుగైన శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. శిక్షణ అనంతరం పరికరాల కొనుగోలుకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్టు చెప్పారు. విశ్వకర్మ జయంతి అయిన సెప్టెంబరు 17 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకంతో దాదాపు 30 లక్షల మంది హస్తకళాకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.