Donot Miss
Latest Posts
Tech News
Life Style
Popular News
భారీ వర్షాలతో తెలంగాణ విలవిల
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు రికార్డు స్థాయిలో కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఎనిమిది మంది చనిపోయారని సమాచారం. మూడు రోజుల రెడ్ అలర్ట్ తర్వాత, వాతావరణ శాఖ అనేక జిల్లాల్లో హెచ్చరిక స్థాయిని ‘ఆరెంజ్’ అలర్ట్ కు తగ్గించింది. గురువారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల్లో లక్ష్మీదేవిపేట (ములుగు జిల్లా), చిట్యాల (జయశంకర్ భూపాలపల్లి)లో వరుసగా 64.98 సెం.మీ, 61.65 సెం.మీ వర్షపాతం నమోదైంది. నివేదికల ప్రకారం, గురువారం భారీ వర్షం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కనీసం […]
బెంగళూరు టెకీ-మోడల్ ఆత్మహత్య.. నిందితుడిని పట్టించిన డైరీ
Bengaluru: బెంగళూరుకు చెందిన టెక్కీ/ మోడల్ ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని ఆమె రాసుకున్న డైరీ పట్టించింది. డైరీలో ఆమె పేర్కొన్న ఆధారాలతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు బెంగళూరులో మరణించిన మోడల్ తనకు ఎదురైన వేధింపుల వివరిస్తూ డైరీలో పూర్తి వివరాలను రాసింది. విచారణలో భాగంగా ఆ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో వివరాల ఆధారంగా ఆమె ప్రియుడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఉత్తర బెంగళూరులోని […]
ఐదేళ్లలో వన్యప్రాణుల కారణంగా 2,950 మంది మృతి
wildlife conflict in india: దేశంలో మానవులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణలు గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. 2018 నుండి భారతదేశంలో ఏనుగులు, పులుల కారణంగా 2,950 మంది మరణించారు. ఈ విషయాన్ని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ గురువారం రాజ్యసభలో తెలిపారు. ఈ సంఘర్షణలో మొత్తం బాధితుల్లో 90 శాతం మంది ప్రాణాలను బలిగొన్నది ఏనుగుల దాడి. 2022-23లో 605 మంది ఏనుగుల దాడులకు గురయ్యారు. 148 మరణాలతో […]
67 గ్రామాలు డ్రగ్స్ అమ్మేవారిని సామాజికంగా బహిష్కరించాయి..
ముమ్మర తనిఖీలు, అవగాహన కార్యక్రమాలతో పంజాబ్ పోలీసులు సాధించిన విజయం ఇదీ.. పంజాబ్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పంజాబ్ యువతను డ్రగ్స్ కు బానిసలుగా చేసి వారి హింసాత్మక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారు. అయితే ఈ ముప్పును నివారించేందుకు పోలీసులు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ముమ్మరంగా ప్రచారం చేపడుతున్నారు. విస్తృతంగా తనిఖీలు కార్డన్ సెర్చ్ లు నిర్వహిస్తున్నారు. అయతే వీరి ప్రయత్నాలు క్రమంగా సత్ఫలితాలిస్తున్నాయి. తాజాగా సంగ్రూర్ జిల్లాలోని సుమారు 67 గ్రామాలు, 20 […]
Manipur violence : మణిపూర్ వైరల్ వీడియో రికార్డు చేసిన వ్యక్తి అరెస్ట్
కేసును సీబీఐకి అప్పగించే ఛాన్స్ Manipur violence : మణిపూర్ భయానక లైంగిక వేధింపుల కేసులో ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన దారుణమైన వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నివేదికల ప్రకారం.. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) వైరల్ వీడియో కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి రిఫర్ చేసే అవకాశం […]
సెంటీమీటర్ పుస్తకంలో హనుమాన్ చాలీసా..
పురాతన కాలం నుంచి హనుమాన్ చాలీసా హిందూ సంస్కృతిలో ఓ భాగమైంది. ఆంజనేయస్వామిని ఆరాధించే వారు ఈ స్తోత్రాన్ని తప్పనిసరిగా పారాయణం చేస్తారు. హనుమాన్ చాలీసా 40 శ్లోకాలను కలిగి ఉంటుంది. అయితే భక్తుడు కేవలం ఒక్క సెంటీమీటర్ ఉన్న పుస్తకంలో హనుమాన్ చాలీసా రాశాడు. హరియాణాలోని హిస్సార్ కు చెందిన జితేంద్ర పాల్ సింగ్ ఒక సెంటీమీటర్ పుస్తకంలో హనుమాన్ చాలీసాను రాశాడు. జితేంద్రపాల్ సింగ్ అత్యంత సూక్ష్మమైన 15 పేజీల పుస్తకాన్ని రూపొందించారు. ప్రతీ […]
గేదెను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి వెక్కివెక్కి ఏడ్చిన రైతు
అసలు కారణం ఏమిటీ? ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఒక రైతు తన గేదె పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చాడు. అక్కడ తన గేదెను కట్టివేసాడు. తన గేదెపై జరిగిన దాడి గురించి వివరిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా తిర్వా కొత్వాలి ప్రాంతంలోని అహెర్ గ్రామానికి చెందిన సంతోష్ తన గేదెతో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. గ్రామంలోని ఒక రైతుకు చెందిన పొలంలో మొక్కజొన్నచేనును ఈ గేదె కొద్ది మొత్తంలో […]
అదృశ్యమైన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి విశాఖ బీచ్‌లో శవమై కనిపించాడు
Vishakhapatnam: గత వారం అదృశ్యమైన హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థి కార్తీక్(21) మంగళవారం విశాఖపట్నంలోని బీచ్ లో శవమై కనిపించాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని వాటర్ ట్యాంక్ తండాకు చెందిన రైతు, చిరువ్యాపారి అయిన ఉమ్లా నాయక్ కుమారుడు.. కార్తీక్ ఐఐటీ హైదరాబాద్ లో బీటెక్-మెకానికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల 17న ఐఐటీ క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యాడు. 17న తండ్రి ఉమ్లా నాయక్ ఫోన్ చేసినా కార్తీక్ లిఫ్ట్ చేయలేదు. […]
మయన్మార్ నుంచి మళ్లీ భారీగా అక్రమ వలసలు
ఎలాంటి పత్రాలు లేకుండా 700 మంది మణిపూర్‌లోకి ప్రవేశం వారిని వెనక్కి పంపాలని అస్సాం రైఫిల్స్ డిమాండ్ మయన్మార్ దేశంలో సైన్యానికి, పౌరులకు మధ్య జరుగుతున్న ఘర్షణల కారణంగా మయన్మార్ దేశానికి చెందిన 301 మంది పిల్లలు, 208 మంది మహిళలు సహా 718 మంది మణిపూర్‌లోని చందేల్ జిల్లాలోకి ప్రవేశించారు. మయన్మార్ జాతీయులను వెనక్కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అస్సాం రైఫిల్స్‌ను కోరిందని, మణిపూర్ చీఫ్ సెక్రటరీ వినీత్ జోషి ఒక ప్రకటనలో తెలిపారు. సరైన […]
pink eye : కండ్ల కలక కేసులు పెరిగిపోతున్నాయ్.. ఇది ఎందుకొస్తుంది ? ఎలా నివారించాలి..?
Pink eye (conjunctivitis) : దేశవ్యాప్తంగా కాంజుంక్టివిటిస్ (కండ్ల కలక) కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ ఇన్ఫెక్షన్ సోకిందంటే చాలు కళ్ల ఎర్రబబడిపోయి తీవ్రమైన మంట, నొప్పి చికాకును కలిగిస్తుంది. అసలు ఈ కండ్ల కలక ఎందుకొస్తుంది. ఇది వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. కండ్ల కలకను ఐ ఫ్లూ (Eye Flu) లేదా పింక్ ఐ అని కూడా పిలుస్తారు. ఎడతెగని వర్షం, తేమతో కూడిన వాతావరణం, వైరస్, […]
