Chandryaan 3 : చంద్రయాన్-3 ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. ఈ
రోజు సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్ 3 చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుంది. అమెరికా, చైనా, పూర్వ సోవియట్ యూనియన్ తర్వాత చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాల్గవ దేశంగా భారత్ అవతరిస్తుంది. అయితే నీటిని కనుగొనే అవకాశం ఉండడం, చంద్రుడిపై దక్షిణ ధ్రువంపై సాఫ్ట్-ల్యాండ్ చేసిన మొదటి దేశం భారతదేశం అవుతుంది. జూలై 14న చంద్రయాన్-3 మిషన్ ప్రారంభమైంది. చంద్రయాన్-2 విఫలమైన తర్వాత తదుపరి మిషన్. ఆగస్టు 5న చంద్రయాన్-3 చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. ఆగష్టు 6, 9, 14, 16వ తేదీలలో అలాగే ఆగస్టు 17న రోవర్, ల్యాండర్.. రెండు మాడ్యూళ్ళను వేరు చేయడానికి ముందు కక్ష్య తగ్గించే విన్యాసాలు జరిగాయి.
Chandrayaan 3 soft landing : ఈరోజు ఏం జరగనుంది?
సాఫ్ట్ ల్యాండింగ్ (soft landing ) అంటే అంతరిక్ష నౌక నియంత్రిత పద్ధతిలో చంద్రుడి ఉపరితలాన్ని తాకడం.. వేగం క్రమంగా తగ్గుతుంది.. అంతరిక్ష నౌక దాదాపు 0 వేగంతో ఉపరితలాన్ని తాకుతుంది. ఒకవేళ హార్డ్ ల్యాండింగ్ అయితే క్రాష్ ల్యాండింగ్, ఇక్కడ అంతరిక్ష నౌక వేగంగా ఉపరితలంపైకి వచ్చి ధ్వంసమవుతుంది. నాలుగేళ్ల క్రితం సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలోనే చద్రయాన్ 2 విఫలమైంది, అయితే ఈసారి మాత్రం అన్నీ విఫలమైన కూడా సాఫ్ట్ ల్యాండింగ్ తప్పకుండా జరుగుతుందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ భరోసా ఇచ్చారు.
30 కిమీ ఎత్తు నుండి గంటకు 1.68 కిమీ వేగంతో కిందకు దిగడం ప్రారంభమవుతుంది. చంద్రయాన్ 3 చంద్రుని ఉపరితలం చేరుకునే సమయానికి, వేగం దాదాపు 0కి తగ్గుతుంది. ఈ రోజు టచ్‌డౌన్ అత్యంత కీలకమైన ఘట్టం. చంద్రయాన్ 3 క్షితిజ సమాంతర దిశ నుంచి నిలువుగా మారుతుంది. ఇక్కడే చంద్రయాన్ 2 సమస్య ఎదురైంది.
Chandrayaan 3: సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ అయిన తర్వాత ఏం జరుగుతుంది?
రోవర్ చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ నుంచి దిగుతుంది. ఆ తర్వాత రోవర్ చంద్రుని ఉపరితలాన్ని విశ్లేషిస్తుంది. ల్యాండర్, రోవర్ భూమిపై 14 రోజులకు సమానమైన ఒక చంద్రుడిపై రోజు సజీవంగా ఉంటాయి. అక్కడి పరిసరాలను అధ్యయనం చేస్తారు. 14 రోజుల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. అవి మరొక చాంద్రమాన దినానికి జీవం పోసుకోవచ్చు, ఇస్రో ( (ISRO)) అధికారులు ఆ అవకాశాన్ని ఇంకా తోసిపుచ్చలేదు.
ఒక చాంద్రమాన దినం అంటే చంద్రునిపై సూర్యుడు ప్రకాశించే సమయం. సూర్యుడు ప్రకాశిస్తున్నంత కాలం అన్ని వ్యవస్థలు బాగా పనిచేస్తాయి. చంద్రునిలో సూర్యుడు అస్తమించినప్పుడు, అక్కడ పూర్తిగా చీకటిగా ఉంటుంది.. మరోవైపు ఉష్ణోగ్రత కూడా మైనస్ 180 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గుతుంది. ఇలాంటి వాతావరణంలో మన అంతరిక్ష నౌక సజీవంగా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ అన్నింటినీ తట్టుకొని సజీవంగా ఉంటే, అది ఇస్రో వైపు నుంచి మరొక భారీ ఘనత అవుతుంది.
Chandryaan 3 ఈసారి మిస్ అయ్యే అవకాశం లేదు.. ఈసారి మిస్ అయ్యే అవకాశం లేదని, విక్రమ్ ల్యాండర్‌లోని అన్ని ఇంజన్లు,
సెన్సార్లు పనిచేయడం ఆగిపోయినా సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. “అంతా విఫలమైతే, అన్ని సెన్సార్లు పనిచేయకపోతే అది (విక్రమ్) ల్యాండింగ్ చేస్తుంది. ప్రొపల్షన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఈసారి కూడా రెండు ఇంజన్లు (విక్రమ్‌లో) పని చేయకున్నా సరిగ్గా ల్యాండ్ అయ్యేలా చూసుకున్నాము, ”అని S సోమనాథ్ (Somanath చెప్పారు.
ఒకవేళ ప్రతిదీ విఫలమైతే, ఆగస్టు 24న ఇస్రో రెండవ ల్యాండింగ్‌కు ప్రయత్నించనున్నారు. 14 రోజుల తర్వాత చాంద్రమాన రోజు మరొక ప్రయత్నం చేయవచ్చు.
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.