Chandryaan-3 ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. చంద్రయాన్ 3 భారతదేశం తరఫున ఇది మూడవ మిషన్. ఈ రోజు సాయంత్రం 6:04 గంటలకు (భారత కాలమానం ప్రకారం) చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్-ల్యాండింగ్ కానుంది. మిషన్ విజయవంతమైతే, విక్రమ్ ల్యాండర్, రోవర్ భూమిపై 14 రోజులకు సమానమైన ఒక చంద్ర రోజు సజీవంగా ఉంటాయి.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ చారిత్రాత్మక మిషన్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ రోజు సాయంత్రం 5:27 నుండి కింది వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
ప్రత్యక్ష ప్రసారం కోసం కింది లింక్ లను క్లిక్ చేయండి
ISRO వెబ్‌సైట్: ఇక్కడ క్లిక్ చేయండి
ISRO అధికారిక YouTube ఛానెల్:
https://youtube.com/watch?v=DLA_64yz8Ss
• ISRO అధికారిక Facebook ఛానెల్:
https://facebook.com/ISRO
• DD నేషనల్ టీవీ
• టీవీ ఛానెల్‌లు
భారతదేశ చారిత్రాత్మక క్షణానికి ఇంకా కొన్ని గంటలలే మిగిలి ఉన్నందున, ల్యాండర్ మాడ్యూల్ – విక్రమ్ ల్యాండర్ – ల్యాండింగ్ కోసం చంద్రుని ఉపరితలంపై సరైన స్థలాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తోంది. అన్నీ ప్రణాళిక ప్రకారం విజయవంతంగా జరిగితే, అమెరికా, రష్యా , చైనాతో కలిసి చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన నాల్గవ దేశంగా భారతదేశం అవతరించనుంది.
చంద్రయాన్-3 ప్రయాణం సాగిందిలా.. :
జూలై 6 : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట రెండవ లాంచ్ ప్యాడ్ నుండి చంద్రయాన్-3 మిషన్ జూలై 14న ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది.
జూలై 7 : అన్ని రకాల ముందస్తు ఎలక్ట్రికల్ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి.
జూలై 11 : 24 గంటల ‘లాంచ్ రిహార్సల్’ విజయవంతంగా జరిగింది.
జూలై 14 : ఇస్రో యొక్క LVM3 M4 చంద్రయాన్-3ని దాని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
జూలై 15 : మిషన్ మొదటి కక్ష్యను పెంచే ప్రక్రియ బెంగళూరులో విజయవంతమైంది. అంతరిక్ష నౌక 41762 కిమీ x 173 కిమీ కక్ష్యకు చేరుకుంది.
జూలై 17 : రెండవ కక్ష్య-లోకి పంపే ప్రక్రియలో భాగంగా చంద్రయాన్-3ని 41603 కిమీ x 226 కిమీ కక్ష్యలో ఉంచింది.
జూలై 22 : నాల్గవ కక్ష్య, భూమి-బౌండ్ పెరిజీ ఫైరింగ్, అంతరిక్ష నౌకను 71351 కిమీ x 233 కిమీ కక్ష్యలో విజయవంతంగా ఉంచింది.
జూలై 25 : మరో కక్ష్యను పెంచే విన్యాసం విజయవంతంగా జరిగింది.
ఆగస్టు 1 : ఒక ముఖ్యమైన మైలురాయి.. చంద్రయాన్-3 288 కిమీ x 369328 కిమీ కక్ష్యతో ట్రాన్స్‌లూనార్ కక్ష్యలోకి ప్రవేశించింది.
ఆగష్టు 5 : అంతరిక్ష నౌక 164 కిమీ x 18074 కిమీ వద్ద చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది.
ఆగష్టు 6 : అంతరిక్ష నౌక కక్ష్య చంద్రుని చుట్టూ 170 కిమీ x 4,313 కిమీకి తగ్గించబడింది.
ఆగష్టు 9 : అంతరిక్ష నౌకను 174 కి.మీ x 1437 కి.మీకి తగ్గించే మరో యుక్తిని ప్రదర్శించారు.
ఆగస్టు 14 : మిషన్ 151 కిమీ x 179 కిమీ కక్ష్యకు సంబంధించి కక్ష్య సర్క్యులరైజేషన్ దశలోకి ప్రవేశించింది.
ఆగస్ట్ 16 : ఫైరింగ్ తర్వాత అంతరిక్ష నౌక 153 కి.మీ x 163 కి.మీ కక్ష్యలోకి ప్రవేశించింది.
ఆగస్టు 17 : విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లతో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ దాని ప్రొపల్షన్ సిస్టమ్ నుండి వేరు చేయబడింది.
ఆగష్టు 18 : అంతరిక్ష నౌక విజయవంతంగా ‘డీబూస్టింగ్’ ఆపరేషన్‌ను పూర్తి చేసింది. దాని కక్ష్యను 113 కిమీ x 157 కిమీకి తగ్గించింది. డీబూస్టింగ్ అనేది చంద్రునికి కక్ష్యలోని అత్యంత సమీప బిందువు (పెరిలున్) 30 కి.మీ. సుదూర బిందువు (అపోలూన్) 100 కి.మీలు ఉన్న కక్ష్యలో తన స్థానాన్ని తగ్గించుకునే ప్రక్రియ.
ఆగస్టు 20 : చంద్రయాన్-3 రెండవ, చివరి డీబూస్టింగ్ ఆపరేషన్‌ను నిర్వహించింది. LM కక్ష్యను 25 కిమీ x 134 కిమీకి తగ్గించింది.
ఆగష్టు 23 : అంతా సవ్యంగా, ప్రణాళిక ప్రకారం జరిగితే, అంతరిక్ష నౌక చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అవుతుంది.
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.