Manipur History : భారతదేశం ఈశాన్యభాగాన ఉన్న ఏడు రాష్ట్రాల్లో మణిపూర్ ఒకటి. దీని రాజధాని ఇంఫాల్ (Imphal) మణిపూర్‌లో మెయితీ (meitei) తెగకు చెందినవారు, అలాగే కుకీలు(kuki), నాగా(Naga) తెగలు ప్రధానంగా ఉంటాయి. ఈ రాష్ట్టాన్ని రత్నాల భూమిగా పిలుస్తారు. మణిపూర్ ఒక సున్నితమైన సరిహద్దు రాష్ట్రంగా భావిస్తారు. కనుక దేశం మిగిలిన ప్రాంతాలలో లేని కొన్ని నిబంధనలు ఇక్కడ అమలవుతున్నాయి.
ఇక మణిపూర్ పూర్వ చరిత్రను పరిశీలిస్తే.. ఈ రాష్ట్రం గొప్ప పురాతన చరిత్రను కలిగి ఉంది. క్రీ.శ. 33 నుంచి శతాబ్దాలుగా వందకు పైగా రాజులచే పరిపాలించారు. ఈ ప్రాంతాన్ని వివిధ కాలాలలో వివిధ రాజులు పరిపాలించడమే కాకుండా కాలానుగుణంగా వివిధ పేర్లతో పిలిచారు.
మణిపూర్‌ని పిలిచే అనేక పేర్లలో కొన్ని:
సన్నా లీపాక్ (Sanna Leipak)
టిల్లీ కోక్‌టాంగ్ (Tilli Koktong)
పొయిరే లాం (Poirei Lam)
మిటే లిపాక్ (Mitei Lipak)
మీత్రాబాక్ (Meitrabak)
మణిపూర్ ను క్రీ.శ 33 లో మొదటి రాజు పఖంగ్బా పాలించాడు. క్రమంగా 16వ శతాబ్దంలో ఖగెంబా (సనా షిహోన్హాన్) , 17వ శతాబ్దంలో పామ్హీబా (గరీబ్ నివాజ్) పరిపాలించారు. ఈయన పక్కనున్న బర్మ ప్రాంతంలోని ప్రవేశించడం ద్వారా మణిపూర్ రాజ్యాన్ని మరింత విస్తరించారు. ఆయన తరువాత 18 వ శతాబ్దంలో మహారాజా భాగ్యచంద్ర పరిపాలిచారు. భాగ్యచంద్ర పాలన కాలం 1762 నుంచి 1798వరకు ఉంది. ఈయన ప్రసిద్ధి చెందిన నృత్యరూపకమైన రాస్ లీలా ను రూపొందించారు. భాగ్యచంద్ర మణిపూర్ లో వైష్షవాన్ని పెద్ద ఎత్తున వ్యాపించేలా చేశారు. మరోవైపు తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి తరచూ బర్మీస్ తో వీరోచితంగా పోరాడారు. బర్మీస్ దండయాత్రల నుంచి అనేకసార్లు మణిపూర్ను కాపాడిన ఘనత భాగ్యచంద్రకే దక్కుతుంది.
ఆధునిక కాలం (1819 AD-ప్రస్తుతం)
1819 ADలో మణిపూర్‌ను రాజు మార్జీత్ పాలించినప్పుడు ఆధునిక కాలం ప్రారంభమైంది. అదే సంవత్సరంలో మణిపూర్‌లో బర్మీయులు దాడి చేసి మణిపూర్‌పై విజయం సాధించారు. చాహి-టారెట్ ఖుంటక్పా రాజు అయ్యాడు. 1825వ సంవత్సరంలో గంభీర్ సింగ్, మణిపురీలకు నాయకత్వం వహించి బర్మీయుల(Burmese)పై దాడి చేసి మణిపూర్ పాలకుడిగా ప్రకటించుకున్నాడు. అతని కుమారుడు మహారాజా చంద్రకీర్త్, అతని మరణం తరువాత, రెండు సంవత్సరాల వయస్సులో సింహాసనాన్ని అధిష్టించాడు. చంద్రకీర్తి పెద్ద కుమారుడు, అతని తండ్రి తర్వాత మహారాజా సూరచంద్ సింహాసనాన్ని అధిష్టించి 1886 AD నుండి 1890 AD వరకు 5 సంవత్సరాలు పాలించారు.
1890 సంవత్సరంలో, జుబరాజ్ టికేంద్రజిత్‌తో పాటు సుర్‌చంద్ తమ్ముళ్లు అంగూసానా, జిల్లంగాంబ అతనిపై తిరుగుబాటు చేశారు. తరువాత, టికేంద్రజిత్ అన్నయ్య, కుల్లచంద్ర రాజు అయ్యాడు. 1891 ఏప్రిల్ 27వ తేదీన బ్రిటిష్ వారు మణిపూర్‌పై బహిరంగ యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని ఇద్దరు రాజులు మహారాజా చురచంద్ సింగ్ (1891-1941 AD) మరియు మహారాజా బుధచంద్ర సింగ్ (1941-1949 AD) మాత్రమే పాలించారు.
ఆంగ్లో-మణిపురి యుద్ధం
1891లో ఖోంగ్ జోమ్ లో భీకరంగా జరిగిన ఆంగ్లో మణిపురి యుద్దంలో బ్రిటీష్ వారు మణీపూర్ ను ఓడించారు. దీంతో అప్పుడు బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. మణిపూర్ రెండో ప్రపంచ యుద్ధం (World War II ) సమయంలో అనేక యుద్ధాలకు సాక్షిగా నిలిచింది. మహానేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ( Netaji Subhas Chandra Bose ) నేతృత్వంలోని భారత జాతీయ సైన్యం (The Indian National Army ) మిత్రరాజ్యాల చేతిలో ఓడిపోకముందే ఇంఫాల్ వైపు సాగింది.
ఇంఫాల్ యుద్ధం
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశంపై దాడి చేయడానికి జపాన్ దేశం చేసిన విఫల ప్రయత్నమే ఇంఫాల్ యుద్ధం (Battle of Imphal).. ఈ భీకర యుద్ధం 1944 మార్చి 6న మొదలై 1944 జూన్ 22 వరకు కొనసాగింది. ప్రపంచ చరిత్రలో జపాన్ కు సంబంధించి గొప్ప ఓటముల్లో ఇంఫాల్ యుద్దం ఒకటి. దాదాపు 120,000 మందితో కూడిన భారీ జపాన్ సైన్యం ఇంఫాల్ నుంచి బ్రిటిష్, భారతీయ దళాలను తరిమేయడానికి యత్నించింది. మణిపూర్ రాజధానిని అలాగే భారతదేశాన్ని ఆక్రమించింది. ఈ క్రమంలో తీవ్రమైన యుద్ధం జరగగా.. జపాన్ సైన్యం భారీ నష్టాలను చవిచూసింది. ఇంఫాల్ యుద్ధంలో వైమానిక. ఫిరం గిదళాలలో బ్రిటిష్- భారతీయ దళాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో మణిపూర్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని తెచ్చిపెట్టింది.
బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య సంగ్రామం కోణం నుండి ఇంఫాల్ యుద్ధం కూడా ముఖ్యమైనగా పరిగణిస్తారు. ఈ యుద్ధంలో వాస్తవానికి జపాన్ వైపు సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ ఉంది. ఎందుకంటే వారు భారతదేశం నుంచి వలస రాజ్యం చేస్తున్న బ్రిటీషర్లను తరిమికొట్టాలని, తద్వారా స్వాతంత్ర్యం పొందాలని అనుకున్నారు కానీ ఆ ప్రణాళిక విఫలమైంది.
దట్టమైన అడవి, వ్యాధి, రుతుపవన వర్షాలు, అలసట, కొండలు, లోయలతో కూడిన సంక్లిష్టమైన భూభాగం, ఆకలి, ఆహారం, ఆయుధాల సరఫరా సమస్యలు జపాన్ సైన్యానికి తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. జపనీస్ లాజిస్టిక్ ప్లాన్ స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ సామాగ్రిపై ఆధారపడింది. అయితే బ్రిటిష్ వారు సరఫరా నిలిపివేయడంతో జపాన్ సైన్యం ఆకలితో అలమటించింది. బ్రిటీషర్లు నిటారుగా ఉన్న భూభాగంలో ట్యాంకులను ఉపయోగించలేరని జపనీయులు భావించారు. కానీ తెలియని మార్గాలు, ప్రతికూలమైనవాతావరణ పరిస్థితులు జపనీస్ సైన్యాన్ని నష్టపరిచాయి. అవే చివరికి వారి పతనానికి కారణమయ్యాయి. ఇంఫాల్ యుద్ధం ముగిసే సమయానికి, పెద్ద సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బ్రిటీష్ దళాల్లో 30,000 మంది, జపాన్ దళాలకు చెందిన 80,000 మంది సైనికులు మరణించినట్లు లెక్కించారు.
తెల్లవారు 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించే వరకు మణిపూర్ ను బ్రిటీష్ వారు పాలించారు. కాగా 1949 సెప్టెంబరు 21న అప్పటి భారత గవర్నర్ జనరల్ అలాగే మహారాజా బోధచంద్ర మధ్య ఒప్పందం మేరకు మణిపూర్ భారతరాజ్యంలో విలీనమైంది. ఆ ఒప్పందం ప్రకారం.. తన జీవితకాలమంతా మణిపూర్ పై అధికారాన్ని కొనసాగించాడు. 1972లో పూర్తిస్థాయిలో మణిపూర్ రాష్ట్రంగా అవతరించింది.
Cultural life
19వ శతాబ్దంలో బ్రిటీష్ పాలనలో క్రైస్తవ మిషనరీలు మణిపూర్లో అడుగుపెట్టడంతో అక్కడ అవాంఛనీయమైన మార్పులు మొదలయ్యాయి.
పూర్తి హిందువులతో కూడిన మణిపూర్ లో మెయిటీ క్రైస్తవుల ఆవిర్భావానికి ఆంగ్లికన్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ సభ్యుడు విలియం పెట్టిగ్రూ పునాదివేశాడు. అతను 1890 లలో మణిపూర్‌కు వచ్చి మణిపురి బాలురకు పాఠశాలలో పాఠాలు బోధించడం ప్రారంభించాడు. అతను మణిపూర్‌లో తన మిషన్ కోసం శాశ్వత స్టేషన్‌ను స్థాపించాడు. ఆతర్వాత మెయిటీ కమ్యూనిటీలో క్రైస్తవ బోధనలు చేయడానికి ప్రయత్నించాడు. ఇది ఉద్దేశపూర్వక వలస విధానంలో భాగంగా మీటీస్‌లో క్రైస్తవ మతాన్ని పెంపొందించేందుకు పెట్టిగ్రూ ప్రయత్నిస్తున్నాడని కొందరు హిందువులు భావించారు. దీనిని వ్యతిరేకించినప్పటికీ పెట్టిగ్రూ తన పనిని కొనసాగించాడు. మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో అనేక క్రైస్తవ పాఠశాలలను స్థాపించాడు.
అయితే మణిపూర్‌లో మొదటిసారిగా మారిన మైతీ క్రిస్టియన్ ఎవరనేది ఇప్పటికీ అనిశ్చితంగా ఉంది. అయితే పరోమ్ సింగ్, నింగోల్ కబోక్లీ వంటి పేర్లు వినిపిస్తాయి. పెటిగ్రూ ఆధ్వర్యంలో పరోమ్ సింగ్ క్రైస్తవ మతంలోకి మారడంతో కలహాలు తీవ్రమయ్యాయి. ఆ సమయంలో అతని వయస్సు కేవలం పదకొండేళ్లు. మొట్టమొదటి క్రైస్తవ మతం మార్పు.. మణిపూర్ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు. తర్వాత పరోమ్ సింగ్ కూడా తన మిషన్‌లో పెట్టిగ్రూకు సహాయం చేశాడు. అక్కడి నుంచి మణిపూర్ ప్రాంతంలో క్రైస్తవ మత ప్రాభల్యం విపరీతంగా పెరిగింది.
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.