Donot Miss
Latest Posts
Tech News
Life Style
Popular News
బస్సును ఢీకొన్న ట్రక్కు.. 11 మంది మృతి, 12 మందికి గాయాలు
భరత్పూర్:రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో జాతీయ రహదారిపై బస్సును ట్రక్కు ఢీకొనడంతో 11 మంది మరణించారు. 12 మంది గాయపడ్డారు. బస్సు రాజస్థాన్‌లోని పుష్కర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు వెళ్తుండగా తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బ్రిడ్జిపై నుంచి బస్సు బ్రేక్ డౌన్ కావడంతో రోడ్డుపై నిలిచిపోయింది.. బస్సు డ్రైవర్ తోపాటు కొంతమంది ప్రయాణికులు బస్సు వెనుక నిలబడి ఉండగా వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో. […]
అత్యాధునిక 3nm A17 బయోనిక్ చిప్ తో iPhone 15 Pro, iPhone 15 Pro Max ఫోన్లు లాంచ్ అయ్యాయి..
ఐఫోన్ వేరియంట్ల స్పెసిఫికేషన్లు, ధరలు యాపిల్ కంపెనీ నుంచి ఏదైనా కొత్త ప్రాడక్ట్ వస్తుందంటే చాలు.. మార్కెట్లో అంది సంచలనమే అవుతుంది. లేటెస్ట్ ట్రెండ్‌కి తగినట్లు యూత్ తోపాటు అన్నికోరుకునే అద్భుతమైన ఫీచర్లతో కొత్త సిరీస్ ఫోన్లను రిలీజ్ చేస్తూ ఐఫోన్ లవర్లను అట్రాక్ట్ చేస్తోంది యాపిల్ కంపెనీ.. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయింది. iPhone 15 Pro, iPhone 15 Pro Max ఫోన్లను ఆపిల్ మంగళవారం రాత్రి […]
వీడియో: ఆటో డ్రైవర్.. చాకచక్యంగా మోసం చేశాడు.. పోలీసులకు చిక్కాడు..
బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్.. బంగ్లాదేశ్ వ్లాగర్‌ని చాకచక్యంగా మోసం చేసి కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను కోల్‌కతాకు చెందిన ఒక వ్లాగర్ ఎక్స్ (ట్విటర్ )లో షేర్ చేసి బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేయడంతో ఈ సంఘటన పోలీసుల దృష్టికి వచ్చింది. కోల్‌కతా వ్లాగర్ మృత్యుంజయ్ సర్దార్ ట్విట్టర్‌లో వివరాలు వెల్లడించారు. “బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తి అతడి స్నేహితురాలితో కలిసి బెంగళూరు పర్యటనకు వచ్చారు. బెంగళూరు ప్యాలెస్’ ను సందర్శించిన తరువాత […]
వీడియో: పగిలిపోయిన మద్యం బారెల్.. వీధుల్లో నదిలా ప్రవహించిన రెడ్ వైన్
పోర్చుగీస్ లోని ఓ చిన్న పట్టణం సావో లోరెంకో డి బైరోలోని వైన్ తయారీ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. దీంతో భారీగా రెడ్ వైన్ వీధుల్లో ప్రవహించింది. 600,000 గ్యాలన్ల మద్యాన్ని నిల్వచేసిన బారెల్స్ ఊహించని విధంగా కూలిపోవడంతో ఈ సంఘటన జరిగింది. నదీ మాదిరిగా రెడ్ వైన్ వీధుల్లో ప్రవహించిన దృశ్యాలను కొందరు వీడియోలు తీశారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీడియోలో సోవో లోరెంకో డి బైరో అనే చిన్న […]
వీడియో: లిబియాలో భారీ తుఫాను.. 2000 మందికిపైగా మృతి.. తీరం వెంట తుడుచుకుపెట్టుకుపోయిన నగరాలు
Libya floods : తూర్పు లిబియాలోని డెర్నా నగరంలో భారీ వరదలు తుఫాను కారణంగా సుమారు 2,000 మంది మరణించారు. వేలాది మంది వరదల్లో గల్లంతయ్యారు. తూర్పు లిబియాను నియంత్రించే లిబియా నేషనల్ ఆర్మీ (ఎల్‌ఎన్‌ఎ) ప్రతినిధి అహ్మద్ మిస్మారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ డెర్నా నగరంపై ఆనకట్టలు కూలిపోవడంతో ఈ విపత్తు సంభవించిదని, భవనాలు, ఇళ్లు పూర్తిగా సముద్రంలోకి కొట్టుకుపోయాయని తెలిపారు. తప్పిపోయిన వారి సంఖ్య 5,000-6,000గా పేర్కొన్నారు. అంతకుముందు సోమవారం, ఈ ప్రాంతంలోని రెడ్ […]
అయ్యప్ప దీక్ష తీసుకున్న చర్చి ఫాదర్..
శబరిమల పుణ్యక్షేత్ర సందర్శన కోసం సేవకుడి లైసెన్స్ వదులుకున్న రెవరెండ్ మనోజ్ తిరువనంతపురం: ప్రసిద్ధ శబరిమల ఆలయాన్ని సందర్శించాలనుకున్న ఓ చర్చి ఫాదర్ (Christian pries).. సేవకుడిగా తనకున్న లైసెన్సును (Church licence) వదులుకున్న ఘటన కేరళలోని (Kerala) తిరువనంతపురంలో చోటుచేసుకుంది. రెవరెండ్ మనోజ్ కేజీ అనే ఫాదర్ ఆంగ్లికన్ చర్చి ఆఫ్ ఇండియాలో (Anglican Church of India) పనిచేస్తున్నారు. ఆయన కేరళలోని ప్రసిద్ధ శబరిమల క్షేత్రాన్ని (Sabarimala Temple) సందర్శించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఇతర […]
మీ ఇంట్లోనే మట్టి వినాయక విగ్రహాన్ని తయారు చేసుకోండి
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టితో తయారు చేసిన వినాయకుల విగ్రహాల(eco-friendly-ganesha)ను వినియోగించాలి. మీకు అందుబాటులో మట్టి విగ్రహాలు అమ్మకానికి లేకుంటే మీ ఇంట్లోనే మీరే స్వయంగా మట్టితో చక్కని గణపతి ప్రతిమను తయారు చేసుకోవచ్చు. అయితే పర్యావరణ ప్రేమికులు మట్టి విగ్రహాలను చాలా చోట్ల ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు. కానీ ఆ విగ్రహాలు లభించనివారు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందు కంటే కింద తెలిపిన సూచనలు పాటిస్తూ మీ ఇంట్లోనే మీరు కూడా మట్టితో వినాయకుడి విగ్రహాన్ని తయారు […]
పీవోపీ ప్రతిమలు వద్దు.. మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం..
Ganesh Chaturthi-2023 : వినాయక చవితి పండుగ సమీపిస్తోంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతూ మండపాల ఏర్పాట్లలో నిర్వాహకులు బిజీ అయ్యారు. అయితే గణేష్ విగ్రహాన్ని కొనుగోలు చేసే ముందు అందరూ ఒక్కసారి ఆలోచించండి.. భవిష్కత్ తరాల కోసం పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాల (clay ganesha idol) నే కొనుగోలు చేయండి.. మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా అనాదిగా వస్తున్న పురాతన సంప్రదాయాన్ని గౌరవించినవాళ్లం కూడా అవుతాం. కొన్ని […]
చీరపై 20 దేశాధినేతల చిత్రాలు, G20 లోగో.. సిరిసిల్ల కళాకారుడి అద్భుత ప్రతిభ
ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సును పురస్కరించుకొని రాజన్న సిరిసిల్లకు జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు తన ప్రతిభతో అద్భుతమైన కళారూపాన్ని తయారు చేశాడు. ఈ చేనేత కార్మికుడు జి20 సదస్సులో దేశాధినేతల చిత్రాలు, భారతీయ చిహ్నాన్ని రెండు మీటర్ల పొడవు గల వస్త్రంపై చూడచక్కగా నేశాడు తెలంగాణలోని రాజన్న సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు (sircilla handloom worker) వెల్ది హరి ప్రసాద్ దేశ విదేశాలకు చెందిన G20 నాయకులను రెండు మీటర్ల క్లాత్ పై […]
Pawan Kalyan : అనుమంచిపల్లిలో పవన్ కళ్యాణ్ అరెస్ట్ !
Pawan Kalyan : విజయవాడ-హైదరాబాద్ రహదారిపై హైటెన్షన్ నెలకొంది. అనుమంచిపల్లిలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను.. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ని అడ్డుకునేం దుకు జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహించిన జనసైనికులు వాటిని తొలగించారు. దీంతో వారిపై పోలీసులు లాఠీఛార్జ్ […]
