భారత దేశంలో కొత్తగా ప్రవేశపెట్టనున్న నారింజ రంగు వందే భారత్ రైళ్లపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. నారింజ రంగు వందేబారత్ రైళ్ల(Orange Vande Bharat Express train) ను ప్రారంభించడం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. శాస్త్రీయ దృష్టితోనే ఈ నారింజ రంగును తీసుకున్నామని తెలిపారు.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జర్నలిస్టులతో జరిగిన సమాశం జరిగింది. నారింజ రంగులో వందేభారత్ రైళ్లను ప్రారంభించడం వెనుక ఏదైనా రాజకీయం ఉందా అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు.. అయన ఈ విధంగా స్పందించారు.
“మానవుల కళ్లకు పసుపు, నారింజ రెండు రంగులు చాల స్పష్టంగా కనిపిస్తాయి. యూరప్ దేశాల్లో దాదాపు 80 శాతం రైళ్లు నారింజ లేదా పసుపు, నారింజ కలయిక ఉంటాయి” అని వైష్ణవ్ చెప్పారు. పసుపు.. నారింజ సిల్వర్ వంటి ప్రకాశవంతమైన అనేక ఇతర రంగులు ఉన్నాయి, కానీ మనం దాని గురించి మాట్లాడినట్లయితే, మానవ కంటికి కనిపించే దృశ్యమానత కోణం నుండి, ఈ రెండు రంగులు ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి” అని ఆయన వివరించారు. దీని వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని, ఇది 100 శాతం శాస్త్రీయ ఆలోచనతోనే ఎంపిక చేసినట్లు వైష్ణవ్ పేర్కొన్నారు.
ఈ కారణాల వల్లనే.. విమానాలు, నౌకల్లోని బ్లాక్‌బాక్స్‌లు నారింజ రంగులో ఉంటాయని అన్నారు. “నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉపయోగించే రెస్క్యూ బోట్లు, లైఫ్ జాకెట్లు కూడా నారింజ రంగులో ఉంటాయి.”
భారతీయ రైల్వే తన మొదటి నారింజ-గ్రే రంగు వందే భారత్ రైలు ( Vande Bharat Express train )ను సెప్టెంబర్ 24న కేరళలోని కాసరగోడ్, తిరువనంతపురం మధ్య ప్రారంభించింది. సెప్టెంబర్ 24న వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన తొమ్మిది వందే భారత్ రైళ్లలో ఇది కూడా ఒకటి.
కాసర్‌గోడ్-తిరువనంతపురం 31వ వందే భారత్ రైలు తమిళనాడులోని చెన్నైలోని పెరంబూర్‌లోని రైలు కోచ్‌ల తయారీ సంస్థ అయిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఆగస్టు 19న ట్రయల్ రన్ కోసం ట్రాక్ పై మొదటిసారి పరుగులు పెట్టింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.