ఆరెంజ్ వందేభారత్ రైలు రంగు మార్పుపై క్లారిటీ ఇచ్చిన రైల్వే మంత్రి….అసలు కారణం ఇదే..
భారత దేశంలో కొత్తగా ప్రవేశపెట్టనున్న నారింజ రంగు వందే భారత్ రైళ్లపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. నారింజ రంగు వందేబారత్ రైళ్ల(Orange Vande Bharat Express train) ను ప్రారంభించడం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. శాస్త్రీయ దృష్టితోనే ఈ నారింజ రంగును తీసుకున్నామని తెలిపారు.రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జర్నలిస్టులతో జరిగిన సమాశం జరిగింది. నారింజ రంగులో వందేభారత్ రైళ్లను ప్రారంభించడం వెనుక ఏదైనా రాజకీయం ఉందా అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు.. అయన ఈ విధంగా స్పందించారు."మానవుల కళ్లకు పసుపు, నారింజ రెండు రంగులు చాల స్పష్టంగా కనిపిస్తాయి. యూరప్ దేశాల్లో దాదాపు 80 శాతం రైళ్లు నారింజ లేదా పసుపు, నారింజ కలయిక ఉంటాయి" అని వైష్ణవ్ చెప్పారు. పసుపు.. నారింజ సిల్వర్ వంటి ప్రకాశవంతమైన అనేక ఇతర రంగులు ఉన్నాయి, కానీ మనం దాని గురించి మాట్లాడినట్లయ...