New SIM card rules : మొబైల్ సిమ్ కార్డుల కొనుగోలుకు సంబంధంచి ప్రభుత్వం కొన్ని నిబంధనల్లో మార్పులు చేసింది. విదేశీ పౌరులు భారతదేశంలో సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేయడాన్ని సులభతరం చేయడానికి ఈ కొత్త నియయాన్ని అమలుచేస్తోంది. గతంలో విదేశీ పౌరులకు (Foreign Nationals) Airtel, Jio లేదా Vi SIM కార్డ్‌లను కొనుగోలు చేయడానికి స్థానిక నంబర్ నుంచి OTP అవసరం ఉండేది. ఈ కొత్త నిబంధనతో, వారు ఇప్పుడు వారి ఇమెయిల్ చిరునామాపై OTP వస్తుంది. సిమ్ కార్డ్‌ని కొనుగోలు చేయడానికి వారికి ఇకపై స్థానిక నంబర్ అవసరం లేదని, కొనుగోలు కోసం వారి ఇమెయిల్‌ను ఉపయోగించవచ్చు.
New SIM card rules for Indian citizens : దీంతోపాటు భారత పౌరుల కోసం కొత్త నిబంధనను ప్రవేశపెట్టారు. కొత్త SIM కార్డ్‌ని కొనుగోలు చేయడానికి పౌరులు eKYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ధ్రువీకరణ ఇప్పుడు తప్పనిసరి. eKYC లేకుండా వ్యక్తులు కొత్త మొబైల్ నంబర్ తీసుకోవడానికి వీలు ఉండదు. eKYC అనేది వినియోగదారు గుర్తింపు, చిరునామాను ఎలక్ట్రానిక్‌గా నిర్ధారించే డిజిటల్ ధృవీకరణ ప్రక్రియ. eKYC ధృవీకరణ లేకుండా SIM కార్డ్‌లను ఇకపై జారీ చేయరు. సైబర్ మోసం, సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి ప్రభుత్వం ఈ ప్రక్రియను తప్పనిసరి చేసింది. వ్యక్తులు వేరొకరి పేరు మీద SIM కార్డ్‌లను కొనుగోలు చేసి, ఆపై నంబర్‌ను దుర్వినియోగం చేయకుండా నిరోధించడమే ఈకేవైసీ లక్ష్యం.
ఇదిలా ఉండగా BSNL భారతదేశంలో తన 5G సేవల ట్రయల్స్ ప్రారంభించింది . కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి, జ్యోతిరాదిత్య M. సింధియా ఇటీవల తన X (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌లో 5G-నెట్‌వర్క్‌ని ఉపయోగించి వీడియో కాల్ చేసిన వీడియోను షేర్ చేశారు.
ఆ పోస్ట్‌లో, “BSNL 5G వీడియో ఫోన్ కాల్‌ని ట్రై చేశాను ” అని మంత్రి పేర్కొన్నారు. BSNL 5G నెట్‌వర్క్‌ను పరీక్షించడానికి మంత్రి సి-డాట్ క్యాంపస్ వెళ్లారు. షేర్ చేసిన వీడియోలో, కాల్‌కి అవతలి వైపున ఉన్న మహిళతో వీడియో కాల్ చేసి అంతా సవ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. అప్పుడు మంత్రి పక్కన నిలబడి ఉన్న ఒక అధికారి, “ఇది BSNL 5Gని ఉపయోగిస్తోంది, అని ఆనందం వ్యక్తం చేశారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..