Wednesday, June 18Thank you for visiting

Jabalpur | తండ్రి, సోదరుడిని చంపిన 15 ఏళ్ల బాలిక.. శరీరాలను ముక్కలు చేసి ఫ్రీజర్‌లో..

Spread the love

Minor girl kills father : మధ్యప్ర‌దేశ్ లో ఊహించ‌ని దారుణ‌మైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. గ‌త‌ మార్చి 15న జబల్‌పూర్‌ (Jabalpur) లోని మిలీనియం సొసైటీలో తన తండ్రి, తొమ్మిదేళ్ల సోదరుడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 ఏళ్ల బాలికను  పోలీసులు అరెస్టు చేశారు. అయితే జంట హ‌త్య‌లు చేసిన అనంత‌రం తండ్రి, త‌మ్ముడి మృతదేహాలను ముక్క‌లుగా చేసి ఫ్రీజర్‌లో భద్రపరచడం అంద‌రినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

పదో తరగతి చ‌దువుతున్నఈ టీనేజ్ బాలిక పోలీసుల‌కు పట్టుబడటానికి ముందు రెండు నెలలకు పైగా పరారీలో ఉంది. స‌ద‌రు బాలిక 19 ఏళ్ల ముకుల్ సింగ్ ను ఇష్ట‌ప‌డింది. అయితే వీరి సంబంధాన్ని రైల్వే హెడ్ క్లర్క్ అయిన త‌న తండ్రి రాజ్‌కుమార్‌ అంగీకరించలేదు. దీంతో సెప్టెంబ‌రులో బాలిక ముకుల్‌తో కలిసి పారిపోయింది. పోలీసులు వెంట‌నే ముకుల్ ను పోక్సో చట్టం (POCSO Act) కింద అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ఇద్దరూ కలిసి ఆమె తండ్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నారు. హత్యల తరువాత, వారు దాదాపు మూడు నెలల పాటు పట్టుబడకుండా తప్పించుకున్నారు, అనేక రాష్ట్రాలు తిరిగారు.

హరిద్వార్ (Haridwar)  ఎస్ఎస్పీ ప్రమీంద్ర దోబల్ మాట్లాడుతూ, బాలిక‌ అనుమానాస్పదంగా తిరుగుతుండ‌గా స్థానికుల ఫిర్యాదుతో బాలికను మొదట నగరంలో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించ‌గా నేరాన్నిఅంగీకరించింది, తన సహచరుడి ముకుల్ సింగ్ గురించి కూడా వెల్ల‌డించింది. దీంతో హ‌రిద్వార్‌ పోలీసులు జబల్పూర్ పోలీసులకు అప్పగించారు. ముకుల్‌ను ప‌ట్టుకునేందుకు పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

తన తండ్రి రాజ్‌కుమార్‌ విశ్వకర్మను చంపేందుకు ముకుల్‌ ప్లాన్‌ వేసినట్లు బాలిక అంగీకరించింది. అత‌డిని హ‌త్య‌చేస్తుండ‌గా బాలిక తమ్ముడు తనిష్క్ మేల్కొన్నాడు. ఈ విష‌యాన్ని ఇత‌రుల‌కు చెబుతాడ‌నే భ‌యంతో అతడిని కూడా చంపేశారు. ముకుల్, మైనర్ బాలిక ఇరుగుపొరుగు వారు. బాలిక తండ్రి రాజ్‌కుమార్,  ముకుల్ తండ్రి ఇద్దరూ రైల్వేలో పనిచేస్తున్నారు. కాగా వీరిద్దరూ గోవా, బెంగళూరు, ముంబై, ఉత్తరప్రదేశ్, పంజాబ్ మీదుగా హరిద్వార్ చేరుకున్నారు. అక్కడ ముకుల్ బాలికను విడిచిపెట్టి పారిపోయాడు. ముకుల్ కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..  

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..