రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి..
న్యూయార్క్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో
మంత్రి కేటీఆర్
పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికా పర్యట నలో కేటీఆర్ న్యూయార్క్ లో జరిగిన ఇన్వె స్టర్ రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొన్నా రు. ఆ సమావేశాన్ని కౌన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, యూఎస్ ఇండియా స్ట్రాట జిక్ పార్ట్నర్ షిప్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహించాయి. రౌండ్ టేబుల్ సమావే శా న్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ మాట్లాడు తూ.. న్యూయార్క్ సిటీతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. న్యూయా ర్క్ సిటీలోనే తాను చదువుకుని, పనిచేసిన ట్లు ఆయన గుర్తుచేశారు. పెట్టుబడులకు తెలం గాణ రాష్ట్రం చాలా ఆదర్శవంతంగా ఉంటుందని, ఎటువంటి వ్యాపారాన్ని అయిన మొదలుపెట్టేందుకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ఐటీ, పరి శ్రమల శాఖ ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడిన విషయాలను ట్వీట్ చేశారు. పలు రకాల పరిశ్రమల ఏర్పాటు విషయం లో తెలంగా ణ సర్కార్ ప్రగతిశీల పథంలో వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. తమ విధా నాలు పరిశ్రమలకు అనుకూలంగా ఉన్నా యన్నారు. ఇన్నో వేషన్ వ్యవస్థను ఉత్తేజపరిచే విధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తెలం గాణ ప్రభుత్వం మొ త్తం 14 రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆ రంగాలకు విస్తృత రీతిలో అవకాశాలను కూడా కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇండియా ను లక్ష్యంగా ఎంపిక చేసుకునే పెట్టుబడిదారులకు తెలంగాణ స్వర్గధామంగా నిలు స్తుందని కేటీఆర్ వెల్ల డించారు.
ఇదే రౌండ్ టేబుల్ సమావేశంలో ఇండియన్ కౌన్సుల్ జనరల్ రణ్ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార అంశాల్లో.. తెలంగాణ, హైదరాబాద్ ప్రత్యే క గుర్తింపు తెచ్చుకున్నాయన్నారు. మంత్రి కేటీఆర్ చురుకుదనాన్ని ఆయన విశేషంగా మెచ్చుకున్నారు. కేటీఆర్ తన వినూత్న వి ధానాలతో హైదరాబాద్ ను విశ్వవ్యాప్తం చేస్తున్నారని రణ్ధీర్ తెలిపారు. ఐటీ, పరి శ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రం జన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ అండ్ ఎ న్ఆర్ఐ అఫైర్స్ స్పెషల్ సెక్రటరీ ఈ విష్ణు వర్ధన్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ ను కలిసిన ఆరన్ క్యాపిటల్ చైర్మన్
ప్రఖ్యాత ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ కంపెనీ ఆరన్ క్యాపిటల్ తెలంగాణ సర్కార్ తో డీల్ కుదుర్చు కుంది. అమెరికా పర్యటనలో ఉన్న మం త్రి కేటీఆర్ ను ఆరన్ క్యాపిటల్ చైర్మ న్ డేవిడ్ వోల్ఫే నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్ బృందం కలిసింది. న్యూయార్క్ లో తెలంగాణ ప్రభుత్వం, ఆరన్ క్యాపిటల్ మధ్య సహకారం గురించి చర్చించారు. తెలంగాణలో పెట్టుబడుల కు అనుకూల వాతావరణం ఉన్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఆవిష్కరణ వ్యవస్థతో పా టు అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, నైపుణ్యవంతమైన వర్క్ ఫోర్స్ కూడా ఉన్నట్లు మంత్రి తెలిపారు. కంపెనీల విలీనం, కొనుగోలు చేయడంలో, పెట్టు బడులను ఆకర్షించడంలో, ఫైనాన్సింగ్, అడ్వైజరీ సేవల్లో ఆరన్ క్యాపిటల్ సంస్థ ప్రత్యేకత కలిగి ఉంది. అనేక రకాల పరిశ్రమలకు చెందిన క్లయింట్లు కంపెనీకి ఉన్నారు. మీడియా, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, కన్జూమర్ ప్రొడక్ట్స్, సర్వీసెస్, ఫుడ్ రంగాల్లో క్లయింట్లు ఉన్నారు.