Home » Sabarimala Yatra: ₹11 వేలకే శబరిమల యాత్ర.. సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైలు
irctc sabarimala

Sabarimala Yatra: ₹11 వేలకే శబరిమల యాత్ర.. సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైలు

Spread the love

IRCTC టూర్ ప్యాకేజీ | శబరిమల యాత్ర కు వెళ్లాలనుకునే వారికి ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ ఆండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) కొత్తగా భారత్‌ గౌరవ్‌ టూరిస్టు రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. పర్యాటక కేంద్రాలు,  పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ప్రాంతాల కోసం నడిపిస్తున్న భారత్‌ గౌరవ్‌ టూరిస్టు రైళ్లకు యాత్రికుల నుంచి భారీ స్పందన వస్తుండటంతో కొత్తగా మరో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. తాజాగా సికింద్రాబాద్‌ (Irctc Sabarimala Package From Hyderabad) నుంచి శబరిమల కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. నవంబర్ 16 నుంచి 20 వరకు కొనసాగనున్న ఈ యాత్రకు సంబంధించిన  కరపత్రాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సోమవారం ఆవిష్కరించారు.

తెలుగు రాష్ట్రాల్లో హాల్లింగ్ స్టేషన్లు

ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్,నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు  

READ MORE  ఒడిశాలో మృత్యుఘోష

శబరిమలలోని ప్రసిద్ధ అయ్యప్పస్వామి ఆలయంతోపాటు ఎర్నాకుళం చోటానిక్కర్‌ అమ్మవారి ఆలయాలను కవర్‌ చేస్తూ సాగే ఈ యాత్ర మొత్తం నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు కొనసాగుతుంది. టూటైర్‌ ఏసీ, త్రీటైర్‌ ఏసీ, స్లీపర్‌ క్లాసుల్లో ప్రయాణానికి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఈ రైలులో మొత్తంగా 716 సీట్లు (స్లీపర్‌ 460, థర్డ్‌ ఏసీ 206, సెకండ్‌ ఏసీ 50 సీట్లు) ఉన్నాయి.

  • పర్యటన పేరు/ కోడ్: శబరిమల యాత్ర (SCZBG32)
  • వ్యవధి : 4 రాత్రులు/ 5 రోజులు
  • పర్యటన తేదీ : 16.11.2024
  • సీట్ల సంఖ్య : 716 (SL: 460, 3AC: 206, 2AC: 50)

ప్రయాణం ఇలా..

నవంబర్ 16న ఉదయం 8గంటలకు ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. మరుసటి రోజు రాత్రి 7గంటలకు కేరళలోని చెంగనూర్‌కు చేరుకుంటుంది. అక్కడ దిగి రోడ్డు మార్గంలో నీలక్కళ్‌కు తీసుకెళ్తారు. అక్కడి నుంచి సొంతంగానే కేరళ ఆర్టీసీ బస్సుల్లో పంబ వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. మూడో రోజు దర్శనం, షేకం (శబరిమల బుకింగ్) తర్వాత అభి మధ్యాహ్నం 1గంట వరకు నీలక్కళ్‌నుంచి చోటానిక్కర/ఎర్నాకుళం వచ్చి రాత్రి బస చేస్తారు. నాలుగో రోజు ఉదయం 7గంటలకు చోటానిక్కర అమ్మవారి (చొట్టనిక్కర దేవాలయం) ఆలయాన్ని దర్శించుకొని.. రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. ఎర్నాకుళం టౌన్‌లో మధ్యాహ్నం 12గంటలకు రైలు బయల్దేరుతుంది. ఐదో రోజు రాత్రి 9.45గంటలకు తిరిగి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

READ MORE  Radhika Sarathkumar | లోక్ స‌భ ఎన్నిక‌ల బ‌రిలో రాధికా శ‌ర‌త్ కుమార్‌..

ప్యాకేజీ ఛార్జీల వివరాలు..

(irctc sabarimala ) ఎకానమీ (SL) కేటగిరీలో ఒక్కో టికెట్‌ ధర రూ.11,475; 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.10,655 చెల్లించాలి.
స్టాండర్డ్‌ (3AC)కేటగిరీలో రూ.18,790; 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.17,700
కంఫర్ట్‌ (2AC) కేటగిరీలో రూ.24,215; 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.22,910 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

  • ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అంతా రైల్వే సిబ్బందే అందిస్తారు.
  • యాత్రికులకు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటుంది.
  • పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే యాత్రికులే చెల్లించుకోవాల్సి ఉంటుంది.
  • పుణ్యక్షేత్రాల్లో స్త్రీ, పురుషులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలి.
  • ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
READ MORE  New Exrpress | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్ సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..