iQoo Neo 8 సిరీస్‌తో పాటు iQoo TWS ఎయిర్ ప్రో ఇయర్‌బడ్‌లు చైనాలో ప్రారంభించారు. చైనీస్ బ్రాండ్ నుంచి కొత్త TWS ఇయర్ బడ్స్ దుమ్ము, నీటి నిరోధకత కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. ఛార్జింగ్ కేస్‌తో గరిష్టంగా 30 గంటల ప్లేబ్యాక్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. వివో చైనీస్ స్టోర్ ద్వారా ఇయర్‌ఫోన్‌లను మే 31న విక్రయించనున్నారు. రెండు కలర్స్ ఆప్షన్లతో లభిస్తుంది, ఇయర్‌బడ్స్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీకి సపోర్ట్ ఇస్తుంది.
iQoo TWS ఎయిర్ ప్రో ధర
iQoo TWS ఎయిర్ ప్రో ధర CNY 299 (సుమారు రూ.3,510). Vivo చైనా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ముందస్తు ఆర్డర్‌ల కోసం ప్రస్తుతం ఇయర్‌బడ్‌లు అందుబాటులో ఉన్నాయి . TWS ఇయర్‌బడ్‌లు మే 31న విక్రయించనున్నారు. అవి స్టార్ ఎల్లో, స్టార్ డైమండ్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
iQoo TWS ఎయిర్ ప్రో ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇయర్‌బడ్‌లు కంపెనీ డీప్‌ఎక్స్ 2.0 స్టీరియో ఎఫెక్ట్‌తో 14.2ఎమ్ఎమ్ డ్రైవర్‌లను కలిగి ఉంటాయి. 20-20,000హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ప్రతిస్పందన పరిధిని కలిగి ఉంటాయి. AAC, SBC వంటి ఆడియో కోడెక్‌లతో పాటు బ్లూటూత్ v5.3 కనెక్టివిటీకి సపోర్ట్ ఇస్తాయి.
iQoo ప్రకారం, ఇయర్‌బడ్స్‌లో అడాప్టివ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, అలాగే డ్యూయల్ మైక్రోఫోన్ AI కాల్ నాయిస్ డిడక్షన్, స్పష్టమైన ధ్వనిని అందించడానికి DNN అల్గోరిథం కూడా ఉన్నాయి.
iQoo TWS ఎయిర్ ప్రో ఇయర్‌బడ్‌లు.. ఛార్జింగ్ కేస్‌తో గరిష్టంగా 30 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందజేస్తాయని కంపెనీ పేర్కొంది. iQoo TWS ఎయిర్ ప్రో ఛార్జింగ్ కేస్ 420mAh బ్యాటరీతో పనిచేస్తుంది, అయితే ప్రతి బడ్ 29mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కేసు ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్‌ను కలిగి ఉంది. .