ధర రూ.12,999.
Lenovo Tab M9 భారతదేశంలో శుక్రవారం విడుదలైంది. ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్ డ్యూయల్-టోన్ డిజైన్‌తో మెటల్ బాడీతో వస్తుంది. ఫేషియల్ అన్‌లాకింగ్‌కు మద్దతు ఇస్తుంది. Lenovo Tab M9, MediaTek Helio G80 SoCపై రన్ అవుతుంది, దీనితో పాటు 4GB RAM, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంటుంది. ఇది డాల్బీ అట్మోస్ టెక్నాలజీతో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది. వెనుకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. Lenovo Tab లో 5,100mAh బ్యాటరీని అమర్చారు. ఇది ఒక ఛార్జ్‌పై గరిష్టంగా 13 గంటల వీడియో ప్లేబ్యాక్ టైం ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
Lenovo Tab M9 ధర
భారతదేశంలో ప్రారంభ ధర రూ. 12,999. ఈ టాబ్లెట్ ఫ్రాస్ట్ బ్లూ స్టార్మ్ గ్రే కలర్ వేరియంట్‌లలో వస్తుంది, జూన్ 1 నుంచి Amazon, Flipkart, Lenovo.com అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. ఇది ఆఫ్‌లైన్ రిటైల్ షాపుల్లోనూ అందుబాటులో ఉంటుంది. Lenovo Tab M9 CES 2023 $139 (దాదాపు రూ. 12,000) ప్రారంభ ధరతో ప్రవేశపెట్టారు.
స్పెసిఫికేషన్స్
Tab M9 Android 12 లో నడుస్తుంది. కంపెనీ మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్స్, ఒక Android OS అప్‌డేట్‌ను ఇస్తామని తెలిపింది. ఇది 9-అంగుళాల HD (800 X 1,340 పిక్సెల్స్ ) LCD TFT డిస్‌ప్లేను 400 nits గరిష్ట బ్రైట్ నెస్ కలిగి ఉంది. డిస్ప్లే TÜV రైన్‌ల్యాండ్ కంటి సంరక్షణ ఫీచర్ కూడా కలిగి ఉంది. టాబ్లెట్ 4GB వరకు LPDDR4X RAMతో పాటు ఆక్టా-కోర్ MediaTek Helio G80 SoCని కలిగి ఉంది.
Lenovo ఆటో ఫోకస్‌తో 8-మెగాపిక్సెల్ వెనుక కెమెరాను అందించింది. ముందు భాగంలో, ఇది 2-మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది 64GB eMMC ఆన్‌బోర్డ్ స్టోరేజ్ అందిస్తుంది, దీనిని మైక్రో SD కార్డ్ తో 128GB వరకు విస్తరించవచ్చు.
కనెక్టివిటీ విషయానికొస్తే 4G LTE, Wi-Fi 802.11AC, బ్లూటూత్ 5.1, హెడ్‌ఫోన్ పోర్ట్, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇది Google One, Google TV, Netflix, YouTube Kidsతో ప్రీలోడ్ చేయబడింది. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, హాల్ సెన్సార్ ఉన్నాయి. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు కూడా మద్దతు ఇస్తుంది.
Lenovo Tab M9 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,100mAh బ్యాటరీని కలిగి ఉంది. బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 13 గంటల వీడియో ప్లేబ్యాక్ సమయం, 15 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్, 12 గంటల వరకు వెబ్ బ్రౌజింగ్ సమయాన్ని అందిస్తుంది. ఈ టాబ్లెట్ డాల్బీ అట్మాస్ స్పేషియల్ ఆడియో టెక్నాలజీ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.