Saturday, August 30Thank you for visiting

పాకిస్తాన్‌కు మద్దతిచ్చిన అజర్‌బైజాన్, టర్కీదేశాలను బహిష్కరించాలని పిలుపు.. Boycott Turkey Azerbaijan

Spread the love

Boycott Turkey Azerbaijan జమ్మూ కశ్మీర్ లో పహల్గామ్ లో ఉగ్రవాదులు పాశవిక దాడి చేశారు. అమాయకులైన పర్యాటకులను మతం అడిగి హిందువులు అని నిర్ధారించుకున్న తర్వాత అత్యంత దారుణంగా చంపేశారు. ఈ దారుణ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. దీనికి భారత వాయుసేన దీటైన జవాబిచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఆపరేషన్ సింధూర్ కోడ్ నేమ్ తో ఏకకాలంలో 9 చోట ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. భారత్ చర్యలపై ప్రపంచం వ్యాప్తంగా మద్దతు లభించింది. కానీ ఆపరేషన్ సిందూర్ ను ఖండిస్తూ టర్కీ, అజర్‌బైజాన్ వంటి దేశాలు పాకిస్తాన్ పంచన చేరాయి. తాజాగా అజర్‌బైజాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ” పాకిస్తాన్ ప్రజలకు సంఘీభావం ” తెలియజేస్తున్నట్లు ప్రకటించింది.

“అంతేకాదు పాకిస్తాన్ పై జరిగిన సైనిక దాడులను ఖండిస్తున్నామని తెలిపింది. ఈ దాడిలో అనేక పాకిస్తాన్ మంది పౌరులు మరణించారని, తాము పాక్ ప్రజలకు అండగా ఉంటామని ప్రకటించింది.

అజర్‌బైజాన్ , టర్కీలను నిషేధించండి’

Boycott Turkey Azerbaijan : ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు మద్దతిస్తున్న అజర్ బైజాన్ కు ఎవరూ సపోర్ట్ ఇవ్వొద్దని పలువురు భారతీయులు సోషల్ మీడియా వేదికగా పోస్టులుపెడుతున్నారు. ఆ దేశ రాజధారి బాకుని ఎవరూ సందర్శించ వద్దని పేర్కొంటున్నారు. 2024 లో అజర్‌బైజాన్‌కి వెళ్ళే భారతీయ పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే ఇప్పుడు భారతీయ పర్యాటకులు తమ పవర్ ఏంటో చూపించండి!” అని ఒకరు పిలుపునిచ్చారు. ఏ దేశభక్తి గల భారతీయుడైనా తన డబ్బును అజర్‌బైజాన్, టర్కీ దేశాలకు బదులుగా ఈ దేశాల ప్రాంతీయ ప్రత్యర్థులైన అర్మేనియా, గ్రీస్‌ దేశాలను సందర్శించడానికి ఎంపిక చేసుకోండి అని చెబుతున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *