Home » మరికొన్ని రోజుల పాటు వడగాల్పులు
heatwave alert

మరికొన్ని రోజుల పాటు వడగాల్పులు

Spread the love

హెచ్చరికలు జారీ చేసిన భారత వాతావరణ శాఖ

దేశంలోని అనేక ప్రాంతాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 దాటిందంటే చాలు ఇంటి నుంచి బయట కాలు పెట్టే పరిస్థితి లేదు. అయితే భారత వాతావరణ శాఖ (IMD)  Indian Meteorological Department షాకింగ్ న్యూస్ వెలువరించింది. మరో ఐదు రోజుల పాటు బీహార్, జార్ఖండ్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు ప్రాంతల్లో హీట్‌వేవ్ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది.

జూన్ 11-13 మధ్య దక్షిణ హర్యానా-ఢిల్లీ, దక్షిణ ఉత్తరప్రదేశ్, గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిశాలో. అలాగే జూన్ 12న హిమాలయ పశ్చిమ బెంగాల్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలలో హీట్‌వేవ్ పరిస్థితులు కూడా ఉంటాయని అంచనా. దేశంలోని అనేక
రాష్ట్రాల్లో విపరీతమైన ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని, అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర, నాన్ ఎయిడెడ్ (మైనారిటీతో సహా) రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని ప్రైవేట్ పాఠశాలలు జూన్ 12 నుంచి జూన్ 14 వరకు మూసివేశారు.
బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో ఉన్న హీట్‌వేవ్ పరిస్థితుల దృష్ట్యా, ఈ ప్రాంతాలలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు IMD సైంటిస్ట్ నరేష్ కుమార్ తెలియజేసినట్లు వార్తా సంస్థ ANI నివేదించింది.

READ MORE  Heavy Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజుల్లో తీవ్రమైన వేడిగాలులు  వీస్తాయని అంచనా వేశారు. ఉష్ణోగ్రత సాధారణం కంటే 6.5 డిగ్రీలు పెరుగుతుంది.
రాజస్థాన్ హీట్‌వేవ్‌కు ప్రధాన జోన్‌గా ఉంది.దక్షిణ ఉత్తరప్రదేశ్, NCR ఢిల్లీతో పాటు దక్షిణ హర్యానా ప్రాంతంలో రాబోయే 2 నుండి 3 రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని మేము ఆశిస్తున్నాము. ముందుజాగ్రత్త చర్యగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఎన్‌సీఆర్, హర్యానాలలో రాబోయే మూడు రోజుల పాటు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేశామని IMD సైంటిస్ట్ నరేష్ కుమార్ తెలిపారు.

READ MORE  Work From Home Jobs | అర్జంట్ గా వర్క్ ఫ్రం హోం చేసే వాళ్ళు కావలెను

Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..