హైదరాబాద్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ మంగళవారం ఆల్ట్రోజ్ ఐసిఎన్‌జి (Tata Altroz iCNG) మోడల్ ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 7.55 లక్షలు. Altroz iCNG భారతదేశపు మొట్టమొదటి ట్విన్-సిలిండర్ CNG టెక్నాలజీ కారు. టాటా మోటార్స్ విజయవంతంగా CNG కిట్‌ను బూట్ స్పేస్ కింద ట్విన్-సిలిండర్‌లతో అమర్చింది. దీనివల్ల CNG కారులో లగేజీ కోసం కావల్సినంత స్పేస్ అందుబాటులో ఉంటుంది.
టియాగో, టిగోర్‌లలో iCNG విజయం సాధించిన తర్వాత, Altroz iCNG అనేది పర్సనల్ విభాగంలో టాటా మోటార్స్ కు సంబంధించి ఇది మూడో CNG వాహనం. ఈ కారు XE, XM+, XM+(S), XZ, XZ+(S) తోపాటు XZ+O(S) అనే ఆరు వేరియంట్‌లలో వస్తుంది. ఇక ఈ కారు Opera బ్లూ, డౌన్‌టౌన్ రెడ్, ఆర్కేడ్ గ్రే, అవెన్యూ వైట్ అనే నాలుగు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. . Altroz iCNG కారు 3 సంవత్సరాలు / 100000 కిమీ ప్రామాణిక వారంటీ ఇస్తోంది.
అనేక స్మార్ట్ ఫీచర్లు
Tata Altroz iCNG లో వాయిస్-అసిస్టెంట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED DRLలు, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో హర్మాన్ -స్పీకర్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి కొత్త ఫీచర్లతో వస్తుంది.
భద్రత ప్రమాణాలు..
భద్రతా ప్రమాణాల విషయానికి వస్తే, Altroz పోర్ట్‌ఫోలియో అల్ట్రా-హై స్ట్రెంగ్త్ స్టీల్‌ను ఉపయోగించే ALFA (ఎజైల్, లైట్, ఫ్లెక్సిబుల్, అడ్వాన్స్‌డ్) ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో ఇంధనం నింపే సమయంలో కారు స్విచ్ ఆఫ్‌లో ఉంచడానికి మైక్రో-స్విచ్ వంటి అదనపు భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. Altroz iCNG శక్తివంతమైన 1.2L రెవోట్రాన్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 73.5 PS @6000 rpm, 103 Nm @ 3500 rpm టార్క్‌ను అందిస్తుంది.
టాటా మోటార్స్ బ్రాండ్ మార్కెటింగ్ హెడ్, టాటా మోటార్స్ గోపీకృష్ణ గోపు, రవీంద్ర జైన్ మాట్లాడుతూ గత 18లో వచ్చిన గత ఒక మిలియన్ అమ్మకాలతో కంపెనీ ఇటీవల భారతదేశంలో 5 మిలియన్ల అమ్మకాల మైలురాయిని సాధించిందని తెలిపారు. అన్ని ఫోర్-వీలర్ విభాగాలలో టాటా మోటార్స్ మార్కెట్ వాటా వృద్ధి గురించి రవీంద్ర జైన్ మాట్లాడుతూ 2019-20లో 4.75% మార్కెట్ వాటాను కలిగి ఉందని 2022 నుంచి 2023 వరకు 13.88% వరకు పెరిగిందని చెప్పారు.
Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,
టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి