Home » దామోహ్ స్కూల్ పై బుల్డోజర్ చర్య
Ganga Jamna Higher Secondary School

దామోహ్ స్కూల్ పై బుల్డోజర్ చర్య

Spread the love

పిల్లలను హిజాబ్ ధరించాలని బలవంతం చేసిన కేసులో ప్రిన్సిపాల్ తో సహా ముగ్గురి అరెస్టు

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లోని గంగా జమ్నా హయ్యర్ సెకండరీ స్కూల్‌ కు సంబంధించిన ఒక భాగాన్ని బుల్ డోజర్ తో ధ్వంసం చేశారు. సంబంధిత పాఠశాలలో ముస్లిమేతర బాలికలను ‘హిజాబ్’ ధరించమని బలవంతం చేసిన కేసులో Ganga Jamna Higher Secondary School పాఠశాల ప్రిన్సిపాల్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత మంగళవారం పాఠశాలలో అనధికార నిర్మాణాల తొలగింపు చేపట్టారు.

స్థానిక మునిసిపాలిటీల బృందాలు  పాఠశాల (Damoh school ) మొదటి అంతస్తును కూల్చివేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి సీనియర్ డామోహ్ జిల్లా పోలీసు అధికారి ప్రకారం, పాఠశాల ఆవరణలో అనధికారిక నిర్మాణాలకు సంబంధించి స్థానిక మునిసిపాలిటీ ఇటీవల పాఠశాలకు (కేంద్ర ప్రభుత్వ-సహాయక మైనారిటీ పాఠశాల) నోటీసు అందించింది. స్థానిక మున్సిపాలిటీ జారీ చేసిన నోటీసులో పాఠశాలకు మూడు రోజుల సమయం ఇచ్చారు. దాని గడువు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది.
పాఠశాల ధ్వంసమైన కారణంగా పాఠశాలలోని 1200 మంది విద్యార్థుల భవిష్యత్తును ఏమాత్రం ఇబ్బంది కలిగించబోమని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా, హామీ ఇచ్చారు. “మేము ఇతర పాఠశాలల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండేలా చూస్తాము” అని మిశ్రా చెప్పారు.

READ MORE  Ravindra Jadeja | బిజెపిలో చేరిన భారత స్టార్ క్రికెట‌ర్‌

జూన్ 7న పాఠశాలపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ముగ్గురు వ్యక్తులను (పాఠశాల నిర్వహణ కమిటీలోని 11 మంది సభ్యులలో వారు) అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత పాఠశాలపై ఆక్రమణ తొలగింపు చర్య జరిగింది. ముస్లిమేతర బాలికలను పాఠశాలలో ‘హిజాబ్’ ‘hijab’ ధరించమని బలవంతం చేశారు. అంతటితో ఆగకుండా ముస్లింయేతర విద్యార్థులను ఇతర మతాల ప్రార్థనలు పాడమని బలవంతం చేయడంతో పాటు హిందూ విద్యార్థులను మతపరమైన వస్తువులను తొలగించమని బలవంతం చేసినందుకు జూన్ 7న ఎఫ్ఐఆర్ నమోదైంది.
జూన్ 7న ముగ్గురు VI, VIII తరగతి విద్యార్థుల వాంగ్మూలాల ఆధారంగా దామోహ్ కొత్వాలి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అంతకుముందు, జూన్ 2న, పాఠశాల సెకండరీ, సెకండరీ గుర్తింపును ఎంపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే..

READ MORE  PM Modi 3.0 | మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్తం ఖరారు

Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..