Home » జూన్ నెలాఖరులో అయోధ్య ఆలయ ఒకటో అంతస్తు పనులు పూర్తి
Ayodhya temple construction work

జూన్ నెలాఖరులో అయోధ్య ఆలయ ఒకటో అంతస్తు పనులు పూర్తి

Spread the love

వచ్చే జనవరిలో ఆలయ ప్రారంభోత్సవం జరిగే అవకాశం

Ayodhya temple construction work: అయోధ్యలోని మూడు అంతస్థుల రామాలయం మొదటి అంతస్తు నిర్మాణం ఈ నెలాఖరులోగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ పనులు తుది దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. 2020లో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తోంది.

“ఈ నెలాఖరు నాటికి, ఆలయం మొదటి అంతస్తు ప్రారంభమవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. అక్టోబరు నాటికి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది ”అని అన్నారు. ఆగస్టు 5, 2020న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణానికి పునాది వేశారు. ఆ తర్వాత నిర్మాణం ప్రారంభం కాగా సీనియర్ కార్యదర్శులు పర్యవేక్షిస్తున్నారు. రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నేతృత్వంలోని లార్సెన్ & టూబ్రో, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్, ట్రస్ట్‌కు చెందిన ఇంజనీరింగ్ బృందాల సభ్యులతో కూడిన బృందం ఇటీవల దీనిని సమీక్షించింది.
నిర్మాణ కమిటీ అందించిన వివరాల ప్రకారం ఆలయం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ప్రాంగణం నుంచి 161 అడుగుల ఎత్తు ఉంటుంది. గర్భగుడి 20 అడుగుల మేర విస్తరించి ఉంది.

READ MORE  Ram Mandir specialities | ఔరా అనిపించే ప్రత్యేకతలు.. అయోధ్య రామాలయం గురించి విశేషాలు ఇవే..

Ayodhya temple construction work ట్రస్ట్ ప్రకారం, ఆలయం గ్రౌండ్ ఫ్లోర్‌లో 160 స్తంభాలు నిర్మించారు. వీటిలో ఆరు నాగౌర్ జిల్లాకు చెందిన తెల్లటి మక్రానా పాలరాయితో తయారు చేశారు. మిగిలినవి రాజస్థాన్‌లోని బన్సీ పహర్‌పూర్ నుండి పింక్ ఇసుకరాయితో తయారు చేశారు. మక్రానా పాలరాయిని ఆలయ అంతస్తు కోసం కూడా ఉపయోగించనున్నట్లు ట్రస్ట్ తెలిపింది.

ఐదు మండపాలు

“గర్భ గృహం (గర్భగృహం) కాకుండా, ఆలయంలో ఐదు మండపాలు ఉన్నాయి. అవి గూఢ మండపం, రంగ మండపం, నృత్య మండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపం. ఐదు మండపాల గోపురం పరిమాణం 34 అడుగుల వెడల్పు, 32 అడుగుల పొడవు ఉంటుంది. ప్రాంగణం నుండి ఎత్తు 69 అడుగుల నుండి 111 అడుగుల మధ్య ఉంటుంది, ”అని ట్రస్ట్‌లోని సభ్యులు చెప్పారు.

READ MORE  Ayodhya Ram Mandir | రాత్రి వేళ రామ మందిరం ఇలా ఉంటుంది.. ఫొటోలను షేర్‌ చేసిన ట్రస్ట్‌

ఆలయ ప్రవేశం “సింగ్ ద్వార్” నుండి ఉంటుందని, భక్తులకు మొదటి హాల్టు “నృత్య మండపం” వద్ద ఉంటుందని తెలిపారు. “గర్భగృహానికి ముందు ఉన్న గూడ మండపం చివరి హాల్ట్ అవుతుంది. పూజారులు మాత్రమే పూజలు చేసే గర్భగుడిలోకి భక్తులను అనుమతించరు. ”అని సభ్యులు చెప్పారు.

ఈ ఏడాది చివరికల్లా గర్భగుడి నిర్మాణం పూర్తవుతుందని, వచ్చే ఏడాది జనవరిలో ఆలయ ప్రారంభోత్సవం నిర్వహించే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు.

అదే సమయంలో, ప్రారంభ వేడుకలకు మూడు మంచిరోజులను సూచిస్తూ మోడీకి ఆహ్వానం పంపినట్లు ట్రస్ట్ తెలిపింది. జ్యోతిష్యులను సంప్రదించిన తర్వాత షార్ట్‌లిస్ట్ చేసిన మూడు శుభ కరమైన తేదీలు జనవరి 17 నుంచి 24 మధ్య ఉండవచ్చని తెలిసింది.

READ MORE  Congress | అయోధ్యకు వెళ్లినందుకు వేధించారు. అందుకే కాంగ్రెస్ కు రాజీనామా చేశా..

Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..