IIT-Bombay | సీతారాముల‌ను అవమానించేలా నాట‌క ప్రదర్శన.. విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 1.2 లక్షల జరిమానా

IIT-Bombay | సీతారాముల‌ను అవమానించేలా నాట‌క ప్రదర్శన.. విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 1.2 లక్షల జరిమానా
Spread the love

Ramayana skit | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  బొంబాయి (IIT-Bombay) లో గ‌త‌ మార్చిలో ఇన్‌స్టిట్యూట్ లో జ‌రిగిన‌ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫెస్టివల్ సందర్భంగా ‘రాహోవన్ (Raahovan) ‘ అనే నాటకంలో పాల్గొన్న గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 1.2 లక్షల జరిమానా విధించింది.

IIT-Bombay విద్యార్థులు ప్ర‌ద‌ర్శించిన నాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌ (Ramayana skit) .. హిందువుల ఆరాధ్యదైవం రాముడు సీత పట్ల అగౌరవంగా, అవమానకరంగా ఉందని ఆరోపిస్తూ కొంద‌రు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అలాగే పెద్ద ఎత్తున విద్యార్థులు నిర‌స‌న‌లకుదిగారు. దీంతో ఇన్ స్టిట్యూట్ యాజ‌మాన్యం విచార‌ణ అనంత‌రం నలుగురు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ఇన్‌స్టిట్యూట్ రూ.1.20 లక్షల చొప్పున జరిమానా విధించింది. అండర్ గ్రాడ్యుయేట్ అయిన మరో నలుగురు విద్యార్థులు ఒక్కొక్కరికి రూ. 40,000 జరిమానా చెల్లించాలని కోరారు. దీంతోపాటు నిందితులందరూ హాస్టల్ ను కూడా ఖాళీ చేయమని ఆదేశించినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.

READ MORE  అస్సాం సీఎం హిమంత బిస్వాశర్మ కీలక నిర్ణయం.. కరీంగంజ్ జిల్లా పేరు మార్పు..

జూన్ 4న నోటీసు జారీ

జూలై 20, 2024న డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ కార్యాలయంలో రూ. 1.20 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉందని, ఆ విద్యార్థికి ఇన్‌స్టిట్యూట్ జింఖానా అవార్డుల నుంచి ఎలాంటి గుర్తింపు రాకుండా నిషేధించారని నోటీసులో పేర్కొన్నారు. ఈ పెనాల్టీని ఉల్లంఘిస్తే తదుపరి ఆంక్షలు విధిస్తామని పేర్కొంది. అయితే జరిమానా చెల్లింపుపై ఐఐటీ బాంబే విద్యార్థులకు జూన్ 4న నోటీసు జారీ చేసింది. అంతకుముందు, ఈ డ్రామాపై ఫిర్యాదులను పరిష్కరించేందుకు మే 8న క్రమశిక్షణా సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చర్చల అనంతరం కమిటీ ఈ జరిమానాలను సిఫార్సు చేసింది.

READ MORE  vinayaka chavithi : వ్రత కథ విన్నా.. చదివినా ఎంతో పుణ్యఫలం.

‘రావోహన్’ వీడియోలు సోషల్ మీడియాలో క్ష‌ణాల్లోనే వ్యాపించాయి, కళాత్మక స్వేచ్ఛ.. మతపరమైన భావాలపై చర్చను రేకెత్తించింది. అయితే, కొంతమంది వీక్షకులు ఈ నాటకాన్ని అభ్యంతరకరంగా, మతపరమైన భావాలను అగౌరవపరిచేలా భావించడంతో వివాదం తీవ్ర‌మైంది.

ఈ ఏడాది మార్చి 31న ఐఐటీ బాంబేలోని ఓపెన్-ఎయిర్ థియేటర్‌లో ఈ నాటకాన్ని ప్రదర్శించారు. ఏప్రిల్ 8న, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలోని ‘ఐఐటి బి ఫర్ భారత్’ హ్యాండిల్ ఈ నాటకాన్ని రాముడు, రామాయణాన్ని అపహాస్యం చేసేలా ఉంద‌ని పేర్కొంటూ, ప్రదర్శనలోని వీడియో క్లిప్‌లను పోస్ట్ చేశారు.
క్యాంపస్‌లో భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఏ మతాన్ని అవహేళన చేయకుండా నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేయాల‌ని అధికారుల‌ను కోరారు. ఐఐటీ-బీ అడ్మినిస్ట్రేషన్ క్షమాపణలు చెప్పాలని విద్యార్థుల సంఘం డిమాండ్ చేసింది.

READ MORE  water crisis | దేశంలో మరో ఐదు నగరాలకు నీటి కష్టాలు

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *