IIT-Bombay | సీతారాములను అవమానించేలా నాటక ప్రదర్శన.. విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 1.2 లక్షల జరిమానా
Ramayana skit | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి (IIT-Bombay) లో గత మార్చిలో ఇన్‌స్టిట్యూట్ లో జరిగిన పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫెస్టివల్ సందర్భంగా 'రాహోవన్ (Raahovan) ' అనే నాటకంలో పాల్గొన్న గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 1.2 లక్షల జరిమానా విధించింది.IIT-Bombay విద్యార్థులు ప్రదర్శించిన నాటక ప్రదర్శన (Ramayana skit) .. హిందువుల ఆరాధ్యదైవం రాముడు సీత పట్ల అగౌరవంగా, అవమానకరంగా ఉందని ఆరోపిస్తూ కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అలాగే పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనలకుదిగారు. దీంతో ఇన్ స్టిట్యూట్ యాజమాన్యం విచారణ అనంతరం నలుగురు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ఇన్‌స్టిట్యూట్ రూ.1.20 లక్షల చొప్పున జరిమానా విధించింది. అండర్ గ్రాడ్యుయేట్ అయిన మరో నలుగురు విద్యార్థులు ఒక్కొక్కరికి రూ. 40,000 జరిమానా చెల్లించాలని కోరారు. దీంతోపాటు నిందితులందరూ హాస్టల్ ను క...