Posted in

Generic Medicine: జనరిక్‌ మందులే రాయాలి.. డాక్టర్లకు కేంద్రం ఆదేశం

Jan Aushadhi
generic medicine
Spread the love

Generic Medicine : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రతీ ఆస్పత్రి, వెల్‌నెస్‌ సెంటర్లు ఇక నుంచి తప్పనిసరిగా తక్కువ ధరకు లభించే జనరిక్‌ మందులను మాత్రమే  రోగులకు సిఫార్సు చేయాలని కేంద్రం ఆదేశించింది. అలా ప్రిస్ర్కైబ్‌ చేయని వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
‘ప్రభుత్వ ఆస్పత్రులు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద కొనసాగే స్వస్థత కేంద్రాలు, పాలీక్లినిక్‌లు..  ఇక మీదట రోగులకు జనరిక్‌ మందులను మాత్రమే రాయాలి. కొంతమంది డాక్టర్లు చాలా సందర్భాల్లో ప్రసిద్ధి చెందిన కంపెనీల మందులను మాత్రమే రోగులకు ప్రిస్ర్కైబ్‌ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇక నుంచి అలాంటి వారిపై ఉన్నతాధికారుల నిఘా ఉంటుందన్న విషయాన్ని మరవొద్దు’ అని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ డాక్టర అతుల్‌ గోయల్‌ తన ఆదేశాలలో పేర్కొన్నారు.

తమ ఆధ్యర్యంలోని డాక్టర్లు జనరిక్‌ మందులే (Generic Medicine) రోగులకు సిఫార్సు చేసేలా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. తాజా నిబంధనలు ఉల్లంఘించిన డాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో మాదిరిగా పెద్ద సంఖ్యలో ప్రైవేట్‌ మందుల కంపెనీల ప్రతినిధులు ఆస్పత్రులకు వచ్చే సంప్రదాయానికి తక్షణమే స్వస్తి పలకాలని, పరిమిత సంఖ్యలోనే వారికి అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. కొత్తగా తయారైన మందుల గురించిన సమాచారాన్ని వారు డాక్టర్లకు ఈ-మెయిల్‌ ద్వారా మాత్రమే తెలియజేయాలని అతుల్‌ గోయల్‌ సూచించారు.


మరిన్ని అప్‌డేట్‌ల కోసం  హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *