Home » RG కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌ను రద్దు
Sandeep Ghosh

RG కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌ను రద్దు

Spread the love

Ex-RG Kar Principal Sandip Ghosh | RG కర్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌ను గురువారం రద్దు చేసింది. ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం-హత్య కేసులో ఘోష్ సీబీఐ కస్టడీలో ఉన్నారు. సెప్టెంబర్ 19న WBMC నిర్వహించే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల జాబితా నుంచి మాజీ ప్రిన్సిపాల్ తొలగించారు.
బెంగాల్ మెడికల్ యాక్ట్, 1914లోని వివిధ నిబంధనల ప్రకారం సందీప్ ఘోష్‌ లైసెన్స్ ను రద్దు చేసింది. అంతకుముందు, RG కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పాలిగ్రాఫ్ పరీక్షలు, లేయర్డ్ వాయిస్ విశ్లేషణ ప్రతిస్పందనలను CBI ‘మోసపూరితమైనది’ అని పేర్కొంది.

READ MORE  Bengal Hooghly Rape Case | ప‌శ్చిమ బెంగాల్ లో మ‌రో ఘోరం..

భయంకరమైన కోల్‌కతా అత్యాచారం హత్య కేసులో షాకింగ్ వివరాలు నిరంతరం వెలుగు చూస్తునే ఉన్నాయి. ఘోష్ తోపాటు తాలాపూర్ స్టేషన్ SHO అభిజిత్ మోండల్ అరెస్టు తరువాత, వారి CBI రిమాండ్ నోట్‌లను మీడియా సంస్థ‌లు బ‌హిర్గ‌తం చేశాయి. సంఘటన జరిగిన రాత్రి నుంచి నోట్స్ దిగ్భ్రాంతికరమైన వివరాలను వెల్లడించాయి.

మోండల్ రిమాండ్ నోట్‌లోని కీలకాంశాలు…

  • కుట్రలో తప్పుడు వాస్తవాలను ప్రస్తావించారు.
  • GD ఎంట్రీలో తప్పుడు వాస్తవాలు ప్రస్తావించారు.
  • మృతదేహాన్ని పరిశీలించి చనిపోయినట్లు ప్రకటించారు కానీ అభిజిత్ మండల్ వెంటనే FIR నమోదు చేయలేదు.
READ MORE  Underwater Metro Train : దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ట్రైన్.. ఎక్కడుంది.. ప్రత్యకతలు ఏమిటీ?

మరోవైపు సందీప్ ఘోష్ (Sandip Ghosh) పై సీబీఐ రిమాండ్ నోట్ లో అభ‌య‌కు రెండో శవపరీక్షకు అనుమతించ‌లేద‌ని, అభయ కుటుంబం అనేకమార్లు వేడుకున్న‌ప్ప‌టికీ రెండవసారి శవపరీక్ష అనుమతించలేదని, ట్రైనీ డాక్టర్ మృతదేహాన్ని త్వరితంగా దహనం చేశారని ఈ నోట్ వెల్లడించింది.

ఘోష్ రిమాండ్ నోట్‌లో పేర్కొన్న ప్రధాన అంశాలు…

  • అస్పష్టమైన ఫిర్యాదు చేశాడు.
  • ఆయన అధికారికంగా ఫిర్యాదు చేయలేదు.
  • కుటుంబ సభ్యులు డిమాండ్ చేసినప్పటికీ రెండోసారి శవపరీక్షకు అనుమతించలేదు.
  • అభయ మృతదేహానికి హడావిడిగా దహనం చేశారు.
READ MORE  రాజస్థాన్ లో ఘోరం: మహిళను వివస్త్ర చేసి ఊరేగించిన భర్త, అత్తమామలు

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..