Vehicle Scrap Policy | తెలంగాణ రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన పాత వాహనాలను తుక్కు కింద మార్చేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వాతావరణ కాలుష్యాన్ని నియత్రించేందుకు, పర్యావరణాన్ని రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. 2025, జనవరి ఒకటవ తేదీ నుంచి పాత వాహనాల (Old Vehicles)ను స్క్రాప్ కు పంపించాలని నిర్ణయించింది. 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాహనాలు.. ఫిట్‌నెస్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వాహనాలకు ఇక నుంచి రిజిస్ట్రేషన్ ఉండదు. వెహికల్ ఫిట్‌నెస్ పరీక్షలో పాసయితే… గ్రీన్ ట్యాక్స్ (Green Tax) చెల్లించి.. మరో మూడు నుంచి ఐదేళ్లు అదనంగా నడిపించుకోవచ్చు. ఫిట్‌నెస్ టెస్ట్‌లో ఫెయిలైన వాహనాలు మాత్రం స్క్రాప్ కు పంపించాల్సిందే.. ఈ నిబంధనను ఉల్లంఘించి పాతవాహనలను రోడ్లపైకి తీసుకువస్తే అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తెలంగాణలో 15 లక్షల వాహనాలు పాతవే..
తెలంగాణలో ప్రస్తుతం 15 ఏళ్లు పైబడిన వాహనాలు సుమారు 30 లక్షలకుపైగానే ఉన్నాయి. అందులో గ్రేటర్ హైదరాబాద్‌లోనే 20 లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. వీటిలో 15 లక్షలు ద్విచక్రవాహనాలు.. మూడున్నర లక్షల కార్లు, లక్ష గూడ్స్ వాహనాలు, 20 వేల ఆటో రిక్షాలు ఉన్నాయి. రవాణా శాఖ ఇప్పటికే స్క్రాపేజ్ విధానానికి సంబంధించిన ముసాయిదాను రూపొందించి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ప్రస్తుతం ఢిల్లీలో మాత్రమే 15 ఏళ్లు దాటిన వాహనాలను రోడ్లపైకి రాకుండా నిషేధం విధించారు. ఇక కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌తోపాటు అనేక రాష్ట్రాలు తెలంగాణ తరహాలోనే త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నాయి.
రాష్ట్రంలో 15ఏళ్లు పైబడిన వాహనాలు
- ద్విచక్రవాహనాలు : 15లక్షలు
- కార్లు : 3.50లక్షలు
- గూడ్స్ వాహనాలు : లక్ష
- ఆటోలు : 20 వేలు,
ఆర్టీసీ బస్సులకు గండం..
మరోవైపు ఆర్టీసీలో సుమారు 1000 బస్సులు స్క్రాప్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో దాదాపు 2వేల స్కూల్ బస్సులు కూడా 15 ఏళ్లు పైబడినవే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం పాత వాహనాల తుక్కుకు పంపించేందుకు పన్ను రాయితీని ఇవ్వాలని భావిస్తున్నది. పాత వాహనాలు తుక్కుకు ఇచ్చేసి.. కొత్త వాహనాలను కొనుగోలు చేసేటపుడు మోటారు వాహనాల పన్నుపై 10 శాతం నుంచి 15 శాతం వరకు రాయితీని ఇవ్వాలని నిర్ణయించింది.
అయితే వాహనాల స్క్రాపింగ్ ప్రక్రియ ( Vehicle Scrap Policy )కోసం మూడు కంపెనీలు ముందుకు వచ్చినట్లు అధికారులుచెబుతున్నారు. వాతావరణానికి ప్రమాదకరంగా మారిన వాహనాలను తొలగించడమే తమ లక్ష్యమని ట్రాన్స్‌పోర్ట్ అధికారులు పేర్కొంటున్నారు. కాగా జీహెచ్‌ఎంసీలో టిప్పర్లు, అంబులెన్సులు, ఫైరింజన్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రభుత్వ వాహనాలన్నీ పాతబడిపోయాయి. 15ఏళ్ల దాటిన ప్రైవేట్ వాహనాలను రద్దు చేసినట్టే… ప్రభుత్వ వాహనాలను కూడా స్క్రాప్‌కు పంపాలని పప్రైవేట్ వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా 15 ఏళ్లు దాటిన వాహనాలతో రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గతంలో వెల్లడించారు. 2022లో… తెలంగాణలో పాత వాహనాలతో 1306 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 418 మృతి చెందగా, 1100 మందికి పైగా గాయాలయా్యి. బ్రేక్ ఫెయిలవడం వంటివి ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతాయి. క్లచ్‌లు గట్టిగా మారడం, గేర్లు మార్చడం కావడం, వాహనాలు తరచూ ఆగిపోతుండడం వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోడం వంటి సమస్యలు నిత్యం ఎదురవుతుంఆయి. అందుకే పాత వాహనాలను వదిలేయాలని రోడ్ సేప్టీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..