Vehicle Scrap Policy | మీ వాహనం 15 ఏళ్లు దాటిందా? అయితే మీకు షాక్.. జనవరి నుంచి కొత్త రూల్స్
Vehicle Scrap Policy | తెలంగాణ రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన పాత వాహనాలను తుక్కు కింద మార్చేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వాతావరణ కాలుష్యాన్ని నియత్రించేందుకు, పర్యావరణాన్ని రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. 2025, జనవరి ఒకటవ తేదీ నుంచి పాత వాహనాల (Old Vehicles)ను స్క్రాప్ కు పంపించాలని నిర్ణయించింది. 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాహనాలు.. ఫిట్‌నెస్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వాహనాలకు ఇక నుంచి రిజిస్ట్రేషన్ ఉండదు. వెహికల్ ఫిట్‌నెస్ పరీక్షలో పాసయితే... గ్రీన్ ట్యాక్స్ (Green Tax) చెల్లించి.. మరో మూడు నుంచి ఐదేళ్లు అదనంగా నడిపించుకోవచ్చు. ఫిట్‌నెస్ టెస్ట్‌లో ఫెయిలైన వాహనాలు మాత్రం స్క్రాప్ కు పంపించాల్సిందే.. ఈ నిబంధనను ఉల్లంఘించి పాతవాహనలను రోడ్లపైకి తీసుకువస్తే అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తెలంగాణలో 15 లక్...