Driving License Rules | అడ్డదారిలో డ్రైవింగ్ లైసెన్సులను తీసుకోవాలనుకుంటున్నారా? అయితే అలాంటి అక్రమాలకు ఇక చెల్లవు. అడ్డదారిలో లైసెన్స్ పొందేవారిని కట్టడి చేసేందుకు ఆర్టీఏ అధికారులు టెక్నాలజీని వినియోగించుకోనున్నారు. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియకు ఆధునిక హంగులు జోడించారు. ప్రస్తుతం మాన్యువల్ పద్ధతిలో కొనసాగుతున్న పరీక్షకు స్వస్తి చెప్పి ప్రామాణికమైన ఆటోమెటిక్ డ్రైవింగ్ టెస్ట్‌ను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఇక నుంచి లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నవారు కచ్చితంగా ఆటోమెటిక్ డ్రైవింగ్ టెస్టు పాస్ కావాల్సిందే.. రోడ్లపై నిత్యం ఎదురయ్యే ఇబ్బందులను ఈ కొత్త టెస్ట్ ట్రాక్‌పై కృత్రిమంగా కల్పిస్తారు. పరీక్షలో భాగంగా ఆ ట్రాక్‌పై వాహనాన్ని నడిపినప్పుడు కంప్యూటర్‌లో పూర్తిగా రికార్డు అవుతుంది. దీంతో అంతా కరెక్టుగా వాహనం నడిపినవారికే లైసెన్సు జారీ అవుతుంది. డ్రైవింగ్‌లో ఏ చిన్న తప్పు దొర్లినా కంప్యూటర్ పసిగట్టి ఫెయిల్ చేస్తుంది.
కొత్త పద్ధతులు..
Driving License Rules : ఆటోమెటిక్ డ్రైవింగ్ టెస్ట్‌లో మొత్తం ఐదు ట్రాక్‌లను ఏర్పాటు చేస్తారు. ముందుగా ‘హెచ్’ ట్రాక్‌లో వాహనాన్ని రివర్స్ చేయాలి. ఆ తర్వాత ‘ఎస్’ ట్రాక్‌లో వాహనాన్ని ఒక మూల నుంచి మరో మూలకు టర్న్ చేయాల్సి ఉంటుంది. చివరగా మలుపులు, ఎత్తు పల్లాలు, గుంతలు ఉన్న ‘కే’ ట్రాక్‌లో వాహనాన్ని నడిపి, సక్రమంగా పార్క్ చేసి చూపించాలి.పాలి. కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం టూవీలర్ డ్రైవర్ హెల్మెట్, ఫోర్ వీలర్ డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ మొత్తం కంప్యూటర్‌లో రికార్డు అవుతుంది. వాహనాన్ని నడిపేటప్పుడు ఏవైనా పొరపాట్లు చేస్తే పరీక్షలో ఫెయిల్ అయినట్టు కంప్యూటర్‌లో చూపిస్తుంది. పరీక్షలో ఫెయిలైన వారిని మరో నెల రోజులు శిక్షణ తీసుకుని మరలా టెస్టుకు పిలుస్తారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.