BSNL సరికొత్త వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఇది రోజువారీ డేటా పరిమితి లేకుండా ఏడాది వ్యవధిలో 600GB డేటా, 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 100 SMS లను అందిస్తుంది. ఇతర ప్లాన్‌ను పదేపదే రీఛార్జ్ చేయకుండా ఒక్కసారి ఈ ప్లాన్ తో రీచార్జి చేసుకుంటే చాలు సంవత్సరం పాటు టెన్షన్ లేకుండా ఉండవచ్చు.
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNL ఇటీవల తన ప్లాట్‌ఫారమ్‌కు సవరించిన రీఛార్జ్ ప్లాన్‌లు, ఉచిత ఇన్‌స్టాలేషన్ సేవలతో సహా అనేక అప్డేట్లను పరిచయం చేసింది. ఈ కొత్త మార్పులు వినియోగదారులకు ఎక్స్ టెండెడ్ వారంటీ, పెరిగిన డేటా అలవెన్సులు వంటి అనేక ప్రయోజనాలను అందిస్తున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా 4G సేవలను అందించే Airtel, Jio, Vi (Vodafone Idea) నుండి BSNL గట్టి పోటీని ఎదుర్కొంటోంది.
BSNL పలు సర్కిల్‌లలో 4G సేవలను ప్రారంభించడంతోపాటు తన నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటోంది. ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్లతోపాటు అనేక ఆఫర్‌లను తీసుకువస్తోంది. అలాగే, త్వరలో 5G సేవలను ప్రవేశపెట్టడానికి టెలికాం కంపెనీ వద్ద ప్రణాళికలు ఉన్నాయి. ఇది టెలికాం పరిశ్రమలో BSNL స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుంది.
365 రోజుల వాలిడిటీ
Bsnl ఒక యానివల్ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్‌ను కొనసాగిస్తోంది. దీనిలో వినియోగదారులు ఏడాది పొడవునా 600GB డేటాను పొందుతారు. BSNL చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం (X), ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ పేరు PV1999. ఈ ప్లాన్ ధర రూ. 1,999. దీని వ్యాలిడిటీ 365 రోజులు. ఈ ప్లాన్ వినియోగదారులను ఏడాది పొడవునా పదే పదే రీఛార్జ్ చేసుకునే ఇబ్బందులను తొలగిస్తుంది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వినియోగదారులు సంవత్సరంలో మొత్తం 600GB డేటాను వినియోగించుకోవచ్చు. డేటాను ఉపయోగించడానికి రోజువారీ పరిమితి లేదు. ఇది కాకుండా, ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ దేశవ్యాప్తంగా అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత రోమింగ్ సౌకర్యం కూడా ఉంటుంది.
రూ. 1,999 ప్లాన్‌లో వాల్యూ యాడెడ్ సర్వీస్ (VAS)లు : ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 100 ఉచిత SMS లు పంపించుకునే వెసులుబాటు ఉంటుంది. వినియోగదారులు వావ్ ఎంటర్‌టైన్‌మెంట్, జింగ్ మ్యూజిక్, హార్డీ గేమ్‌లు, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, Gameon & Astrotell, Challenger Arena Games, Lystn Podcast, Gameium వంటి అనేక వ్యాల్యూ యాడెడ్ సర్వీసులను కూడా పొందుతారు. ఈ రీచార్జ్ ప్లాన్‌ను BSNL అధికారిక వెబ్‌సైట్, ఇతర ఆన్‌లైన్ యాప్‌ల నుండి రీఛార్జ్ చేసుకోవచ్చు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను సందర్శించడి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి