Home » Triple Talaq | కదులుతున్న రైలులో ట్రిపుల్‌ తలాక్‌.. ఆ త‌ర్వాత ఏమైంది.. ?
Triple Talaq

Triple Talaq | కదులుతున్న రైలులో ట్రిపుల్‌ తలాక్‌.. ఆ త‌ర్వాత ఏమైంది.. ?

Spread the love

లక్నో: ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి కదులుతున్న రైలులో తన భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ (Triple Talaq) చెప్పాడు. రైల్వే స్టేషన్‌లో రైలు నిల‌వ‌గానే భార్యపై దాడి చేసి ప‌రార‌య్యాడు. దీంతో ఒక్క‌సారిగా కంగుతిన్న ఆమె త‌న‌ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివ‌రాల్లోకి వెళితే.. 28 ఏళ్ల మహ్మ‌ద్ అర్షద్‌.. మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో ఒక‌ ప్రైవేట్‌ సంస్థలో సాఫ్ట్ వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కాగా మ్యాట్రిమోనియల్ ప్రకటన ద్వారా కోటాకు చెందిన 26 ఏళ్ల అఫ్సానాతో ప‌రిచ‌మ‌య్యింది. వీరిద్ద‌రూ ఈ ఏడాది జ‌న‌వ‌రిలో వివాహం చేసుకున్నారు.

READ MORE  Mathura | మధుర, బృందావన్‌లోని ప్ర‌సాదాల‌పై అల‌ర్ట్‌.. నమూనాలను ల్యాబ్ కు త‌ర‌లింపు

కాగా, గత వారం ఉత్తరప్రదేశ్‌లోని పుఖ్రాయన్ లో అర్షద్ బంధువుల ఇంటికి అర్ష‌ద్ అఫ్సానా వెళ్లారు. ఈ సందర్భంగా అర్షద్‌కు అప్పటికే వివాహమైనట్లు అఫ్సానా తెలుసుకుని షాక్ అయింది. దీంతో వెంట‌నే అత‌డిని నిల‌దీయ‌గా అర్షద్‌, అతడి తల్లి కలిసి అఫ్సానాపై దాడికి దిగారు. ఆపై వరకట్నం కోసం అఫ్సానాను తీవ్రంగా హింసించారు. ఆ త‌ర్వాత‌ ఏప్రిల్‌ 29న అర్షద్, అఫ్సానా కలిసి పుఖ్రాయన్‌ నుంచి భోపాల్‌కు రైలులో బయలుదేరారు.

READ MORE  watch| కదులుతున్న బస్సులో చెప్పుల‌తో కొట్టుకున్న మ‌హిళ‌లు..

అయితే రైలు ప్రయాణంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం కొన‌సాగింది. ఈ క్ర‌మంలో ఝాన్సీ స్టేషన్‌ సమీపంలో కదులుతున్న రైలులో అర్ష‌ద్ త‌న‌ భార్య అఫ్సానాకు మూడు సార్లు తలాక్‌ (Triple Talaq) చెప్పాడు. రైలు ఝాన్సీ రైల్వేస్టేషన్‌లో నిల‌వ‌గానే భార్యపై దాడి చేసి అర్షద్‌ రైలు దిగి ప‌రార‌య్యాడు. ఈ ఘటనతో షాక్ కు గురైన అఫ్సానా వెంట‌నే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూపీ పోలీసులు కేసు న‌మోదు చేసుకొని పరారీలో ఉన్న అర్షద్‌ కోసం గాలింపు ప్రారంభించారు.

READ MORE  Lulu Mall viral video : లూలూ మాల్ లో కొందరు కక్కుత్తి పడి ఎలా లూటీ చేశారో చూడండి.. వైరల్ అవుతున్న వీడియోలు

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..