BSNL | ఒక్కసారి రీచార్జ్ చేస్తే 365 రోజుల వ్యాలిడిటీ.. బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే ప్లాన్..
BSNL సరికొత్త వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఇది రోజువారీ డేటా పరిమితి లేకుండా ఏడాది వ్యవధిలో 600GB డేటా, 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 100 SMS లను అందిస్తుంది. ఇతర ప్లాన్‌ను పదేపదే రీఛార్జ్ చేయకుండా ఒక్కసారి ఈ ప్లాన్ తో రీచార్జి చేసుకుంటే చాలు సంవత్సరం పాటు టెన్షన్ లేకుండా ఉండవచ్చు.ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNL ఇటీవల తన ప్లాట్‌ఫారమ్‌కు సవరించిన రీఛార్జ్ ప్లాన్‌లు, ఉచిత ఇన్‌స్టాలేషన్ సేవలతో సహా అనేక అప్డేట్లను పరిచయం చేసింది. ఈ కొత్త మార్పులు వినియోగదారులకు ఎక్స్ టెండెడ్ వారంటీ, పెరిగిన డేటా అలవెన్సులు వంటి అనేక ప్రయోజనాలను అందిస్తున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా 4G సేవలను అందించే Airtel, Jio, Vi (Vodafone Idea) నుండి BSNL గట్టి పోటీని ఎదుర్కొంటోంది.BSNL పలు సర్కిల్‌లలో 4G సేవలను ప్రారంభించడంతోపాటు తన నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటోంది. ఆకర్షణీయమైన ...