Friday, February 14Thank you for visiting

Bengaluru Metro : మొన్న బస్సు చార్జీలు..ఇపుడు మెట్రో రైలు ధరల పెంపు

Spread the love

Bengaluru Metro Fare Hike : బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) బోర్డు ఛార్జీల పెంపు సిఫారసును ఆమోదించింది. దీంతో బెంగళూరులో మెట్రో ప్ర‌యాణం మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. పెంచిన‌ టికెట్ల ధ‌ర‌లు పెంపుదల దాని అమలు తేదీని వివరించే అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

2017 తర్వాత BMRCL చేసిన మొదటి ఛార్జీల సవరణ ఇది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ టికెట్, పాస్ ధరలను 15 శాతం పెంచిన రెండు వారాల తర్వాత.. మెట్రో ధ‌ర‌లను పెంచుతూ క‌ర్ణాట‌క కాంగ్రెస్ ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యం తీసుకుంది. ప్రస్తుత మెట్రో ఛార్జీలు రూ. 10 నుండి రూ. 60 వరకు ఉన్నాయి, స్మార్ట్ కార్డ్ వినియోగదారులకు 5 శాతం తగ్గింపు లభిస్తుంది. “స్మార్ట్ కార్డ్‌లు, ఇతర టికెటింగ్ సిస్టమ్‌లలో రాయితీల వివరాలను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని BMRCL ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్ల‌డించారు.

READ MORE  Rapido VOTENOW offer | సీనియర్ సిటిజన్‌లు, దివ్యాంగ ఓటర్లకు రాపిడో ఉచిత రైడ్స్..  ఓటు వేస్తే ఉచితగా దోసె

Bengaluru Metro : బెంగళూరు మెట్రోకు ఆర్థిక ఇబ్బందులు

BMRCL ప్రస్తుతం 77 కి.మీ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది, పర్పుల్ లైన్ 43.5 కి.మీ, గ్రీన్ లైన్ 33.5 కి.మీ విస్తరించి ఉంది. 2011లో బైయప్పనహళ్లి-MG రోడ్డు మార్గంలో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి, BMRCL ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది, గత మూడేళ్లలో రూ. 1,280 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అయితే, కార్పొరేషన్ నష్టాలు 2022-23లో రూ. 476 కోట్ల నుండి 2023-24లో రూ. 341 కోట్లకు తగ్గినట్లు నివేదించింది, సెలవులు లేని వారం రోజుల్లో రోజువారీ ప్రయాణీకుల సంఖ్య అత్య‌ధికంగా 8.5 లక్షలకు చేరుకుంది.

40-45% ఛార్జీలు పెరిగే చాన్స్

ప్రజాల నుంచి విజ్ఞ‌ప్తులు తీసుకున్న తర్వాత రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ సిఫార్సులను అనుసరించి కొత్త‌గా ఛార్జీల సవరణ జరుగుతుంది. 15-20 శాతం ఛార్జీల పెంపును కమిటీ ప్రతిపాదించింది. బెంగుళూరు సెంట్రల్ ఎంపీ పిసి మోహన్ ఈ నిర్ణయాన్ని విమర్శించారు, “45% ఛార్జీల పెంపును విధించినందుకు” తాను “నిరాశ చెందాను” అని పేర్కొన్నారు. గత వారం, మోహన్ బిఎమ్‌ఆర్‌సిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్వరరావును ఛార్జీల సవరణను పునరాలోచించాలని కోరారు, దీనివ‌ల్ల ప్రజలను ప్రజా రవాణాను వ‌దిలేద‌సి ప్రైవేట్ వాహనాలకు మొగ్గుచూపుతార‌ని, తద్వారా న‌గ‌రంలో ట్రాఫిక్ ర‌ద్దీ మ‌రింత పెరుగుతుద‌ని తెలిపారు.

READ MORE  ADR report | 17వ లోక్‌సభలో అత్యంత తక్కువ ప్రశ్నలు అడిగిన పార్టీలు ఇవే..

స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌కుండా చార్జీల పెంపా?

“BMRCL దాని సేవల్లోని కీలక సమస్యలను పరిష్కరించడానికి అత్యవసరంగా చర్య తీసుకోవాలి. నమ్మ మెట్రోలో కిక్కిరిసిపోవడం వల్ల డోర్ పనిచేయకపోవడం, ప్రయాణికుల మధ్య వివాదాలు ఏర్పడుతున్నాయి. BMRCL తప్పనిసరిగా మెట్రో కోచ్‌లను జోడించడం, ఆలస్యమైన లైన్‌లను వేగవంతం చేయడం వంటి వాటికి ప్రాధాన్యతనివ్వాలి. తప్పనిసరిగా భద్రతను మెరుగుపరచాలి, మెరుగైన ప్రయాణానికి పార్కింగ్, క్యూ సిస్టమ్‌లు, లాస్ట్ మైలు కనెక్టివిటీని మెరుగుపరచాలి. ఈ సమస్యలను పరిష్కరించకుండా ఛార్జీలను పెంచడం వల్ల ప్రజలను తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

READ MORE  బెంగళూరులో వరుస బాంబు పేలుళ్లకు కుట్ర : భగ్నం చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్

బస్సు ఛార్జీల పెంపు

ఇటీవల, కర్ణాటక క్యాబినెట్ అన్ని వర్గాలలో ప్రభుత్వ బస్సు ఛార్జీలను 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య ద్వారా నెలకు రూ.74.85 కోట్లు, ఏటా రూ.784 కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..