
Mann Ki Baat : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా విశిష్టతను ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister of India Narendra Modi) కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక ఈ వేడుక అన్నారు. పేదలు, ధనవంతులు అనే తారమతమ్యాలు లేకుఉండా అన్నివర్గాలవారు ఈ మహా సమ్మేళనంలో ఏకం కావడం గర్వకారణమన్నారు. ఈ రోజు ప్రసారమమైన ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ సంభోదించారు. చారిత్రాత్మక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషకరమని అభినందించారు. నాగరికతతో అనుసంధానమయ్యే కొద్దీ మూలాలు బలపడతాయని, ఇది భవిష్యత్తుకు బంగారు పునాది అవుతుందని యువతను ఉద్దేశించి మాట్లాడారు.
Mann Ki Baat ఈ సారి ముందుగానే..
‘మన్ కీ బాత్’ కార్యక్రమం సాధారణంగా నెలలో చివరి ఆదివారం ప్రసారం అవుతుంది. కానీ ఈసారి గణతంత్ర దినోత్సవం (జనవరి 26) రావడం వల్ల ప్రధాని మోదీ ముందుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రధాని మోదీ Mann Ki Baat ముఖ్యాంశాలు
- గణతంత్ర దినోత్సవం ప్రత్యేకత: ఈసారి గణతంత్ర దినోత్సవం ఎంతో ప్రత్యేకమైనదని ప్రధాని (Narendra Modi) పేర్కొన్నారు. రాజ్యాంగ పరిషత్‌లో పనిచేసిన మహనీయులకు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా శిరస్సు వంచి నమస్కిస్తున్నానని అన్నారు.
- మహాకుంభం – ఏకత్వానికి ప్రతీక మహాకుంభమేళా భారతీయ సంస్కృతిలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా గంగాసాగర్ జాతర ప్రస్తావన చేస్తూ ఇది సామరస్యాన్ని, ఐక్యతను పెంపొందిస్తుందని చెప్పారు. మహాకుంభమేళా భారత దేశంలోని భిన్న సంస్కృతులను ఒకదానితో ఒకటి కలుపుతుందన్నారు. ఇది ఐక్యతకు మార్గదర్శిగా నిలుస్తోందన్నారు.
- అయోధ్య రామ మందిరం: అయోధ్యలో రామ లల్లా ప్రతిష్ఠాపన మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం గొప్ప విషయమని ప్రధాని అన్నారు. భారతీయ వారసత్వాన్ని కాపాడుకోవాలని, స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
- అంతరిక్ష సాంకేతికతలో ప్రగతి: అంతరిక్ష సాంకేతికతలో భారత్ సాధించిన పురోగతిని ప్రధాని మోదీ వివరించారు. PIXXEL ప్రైవేట్ ఉపగ్రహం విజయాన్ని, ISRO చేసిన స్పేస్ డాకింగ్ విజయాన్నిప్రశంసించారు. స్పేస్ డాకింగ్ సాధించిన ప్రపంచంలోని నాలుగో దేశంగా భారత్ ఎదగడం గర్వకారణమని అన్నారు.
- జాతీయ ఓటర్ల దినోత్సవం: జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా గుర్తిస్తూ భారత ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యానికి ప్రాముఖ్యత ఇచ్చిందని తెలిపారు. దేశ ప్రజల భాగస్వామ్యం పెరగడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని అభినందించారు.
- స్టార్టప్ ఇండియా విజయాలు: స్టార్టప్ ఇండియా 9 ఏళ్లు పూర్తి చేసుకోవడం గొప్ప ఘనత అని పేర్కొన్నారు. మన స్టార్టప్‌లు ప్రధానంగా చిన్న పట్టణాలు, పల్లెల నుంచి పుట్టుకురావడం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.