Home » Metro Rail News | బెంగళూరు మెట్రో రికార్డు.. ఒక్క‌రోజే 8 లక్షల మంది జ‌ర్నీ
2025 New Year celebrations

Metro Rail News | బెంగళూరు మెట్రో రికార్డు.. ఒక్క‌రోజే 8 లక్షల మంది జ‌ర్నీ

Spread the love

Metro Rail News | బెంగళూరులోని నమ్మ మెట్రో (Namma Metro) స‌రికొత్త రికార్డు సృష్టించింది. మెట్రో రైళ్ల‌లో ప్ర‌యాణికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత పది రోజులుగా రోజుకు 8 లక్షల మంది ప్రయాణిస్తున్న‌ట్లు గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. దీంతో నమ్మ మెట్రో రూ. 25 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న‌ది.

ఇది మెట్రో రైలు వ్య‌వ‌స్థ‌లో గణనీయమైన పెరుగుదలగా చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా చెల్లాఘట్ట నుంచి వైట్‌ఫీల్డ్ వరకు అత్యంత ర‌ద్దీగా ఉన్న మార్గంగా మారింది. ఐటి కంపెనీలకు సేవలందించే మార్గం కావ‌డంతో ప్రయాణికుల సంఖ్య క్ర‌మంగా రెట్టింపు అవుతోంది.

READ MORE  'సీఎం గారూ.. ఆర్టీసీ బస్సుల్లో డబ్బులు పెట్టి నిలబడి ప్రయాణించాలా..?

గతంలో, మెట్రో ప్రతిరోజూ 6.5 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించేది. అయితే, కార్యాలయాలకు వెళ్లేవారు తిరిగి రావడంతో, ఈ సంఖ్య రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 8.11 లక్షలకు పెరిగింది. ప్ర‌యాణ‌కుల‌కు స‌రిప‌డా రైళ్ల సంఖ్య తొమ్మిది నుంచి పదిహేనుకు పెంచారు. ఫలితంగా ప్రతి మూడున్నర నిమిషాలకు ఒక రైలు ప్లాట్ ఫాంపైకి వ‌స్తోంది. ఉదయం వేళ రద్దీగా ఉండే మెట్రో స్టేషన్‌లను నిర్వహించ‌డం చాలా క్లిష్టంగా మారింది.

కెంపేగౌడ మెట్రో స్టేషన్ ఇప్పుడు అత్యధిక ప్రయాణికులతో నిత్యం కిట‌కిట‌లాడుతోంది. అదేవిధంగా విశ్వేశ్వరయ్య మెట్రో స్టేషన్‌లో కూడా ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయింది. ప్రయాణికుల సంఖ్య పెరగడం వల్ల రైళ్ల షెడ్యూల్‌లో కూడా మార్పులు వచ్చాయి, ఇప్పుడు బైయప్పనహళ్లి మెట్రో స్టేషన్ నుంచి రైళ్లు పది నిమిషాలు ముందుగానే ప్రారంభమవుతాయి. ITPL మార్గంలో ప్రయాణించే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కార‌ణంగా మెట్రో వినియోగం పెరిగింది.
మెట్రో యొక్క రోజువారీ ఆదాయం ఇప్పుడు రూ. 2 కోట్లు దాటింది. ఇది ప్రయాణికుల రికార్డు సంఖ్యను ప్రతిబింబిస్తుంది. స్థిరంగా ఉన్న అధిక ప్రయాణికుల సంఖ్య, బెంగుళూరు మెట్రోలోని ఉద్యోగులు, శ్రామికుల రోజువారీ ప్రయాణంలో నమ్మ మెట్రో ప్ర‌యాణికుల‌కు అమూల్య‌మైన సేవ‌ల‌ను అందిస్తోంది.

READ MORE  Zakir Hussain | జాకీర్ హుస్సేన్ మ‌ర‌ణ వార్త‌.. అనేక ట్విస్టులు

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..