
Metro Rail News | బెంగళూరు మెట్రో రికార్డు.. ఒక్కరోజే 8 లక్షల మంది జర్నీ
Metro Rail News | బెంగళూరులోని నమ్మ మెట్రో (Namma Metro) సరికొత్త రికార్డు సృష్టించింది. మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత పది రోజులుగా రోజుకు 8 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో నమ్మ మెట్రో రూ. 25 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నది.ఇది మెట్రో రైలు వ్యవస్థలో గణనీయమైన పెరుగుదలగా చెప్పవచ్చు. ముఖ్యంగా చెల్లాఘట్ట నుంచి వైట్‌ఫీల్డ్ వరకు అత్యంత రద్దీగా ఉన్న మార్గంగా మారింది. ఐటి కంపెనీలకు సేవలందించే మార్గం కావడంతో ప్రయాణికుల సంఖ్య క్రమంగా రెట్టింపు అవుతోంది.గతంలో, మెట్రో ప్రతిరోజూ 6.5 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించేది. అయితే, కార్యాలయాలకు వెళ్లేవారు తిరిగి రావడంతో, ఈ సంఖ్య రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 8.11 లక్షలకు పెరిగింది. ప్రయాణకులకు సరిపడా రైళ్ల సంఖ్య తొమ్మిది నుంచి పదిహేనుకు పెంచారు. ఫలితంగా ప్రతి మూడున్నర నిమ...