Ayodhya Ram Mandir LIVE Updates : జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది, దీనికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) తో సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
అయోధ్యలో జరిగిన సంకీర్తన సందర్భంగా గత గురువారం ఆలయ గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ఉంచారు. కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన ‘రామ్ లల్లా’ విగ్రహం 1.5 టన్నుల బరువు , 51 అంగుళాల పొడవు ఉంటుంది.
‘ప్రాణ్ ప్రతిష్ఠ’ క్రతువులను ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తుండగా, లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలోని అర్చకుల బృందం కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలకు సంబంధించి ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.
అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు కేవలం ఒకే ఒక రోెజు మాత్రమే మిగిలి ఉండగా, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కొత్తగా నిర్మించిన ఆలయానికి సంబంధించిన ఆకర్షణీకమైన ఫొటోలను విడుదల చేసింది. ఆలయ ట్రస్ట్ తన అధికారిక X హ్యాండిల్‌లో మందిరం లోపలి చిత్రాలను
షేర్ చేసింది.
रमानाथ जहँ राजा सो पुर बरनि कि जाइ।
अनिमादिक सुख संपदा रहीं अवध सब छाइ॥ pic.twitter.com/BIvEkBqchF— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 20, 2024
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..