Home » Model Code of Conduct | మోడల్ ఆఫ్ కండక్ట్ అంటే ఏమిటీ..
model code of conduct

Model Code of Conduct | మోడల్ ఆఫ్ కండక్ట్ అంటే ఏమిటీ..

Spread the love

Election code : లోక్‌సభ ఎన్నికలనగారా మోగింది. లోక్ సభతోపాటు ఆంధ్రప్రదేశ్‌ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంగఫ‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమల్లోకి వచ్చింది. పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఈసీ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.  MCC నిబంధనలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్ని రాజకీయ పార్టీలను కోరారు.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏమిటి?

What is Model Code of Conduct  : ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు  జరిగేందుకు ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలను రూపొందించింది. ఈ నిబంధనల సమాహారాన్నే ‘‘మోడల్ ఆఫ్ కండక్ట్’’ అని అంటారు. ఈ నిబంధనలను రాజకీయ పార్టీలు,  అభ్యర్థులు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.  ఏదైనా రాజకీయ పార్టీగానీ  అభ్యర్థి గానీ ఈ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు రుజువైతే  ఎన్నికల సంఘం వారిపై చర్యలు తీుకుంటుంది.  నియమావళిని  ఉల్లంఘించిన వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించ వచ్చు..  అవసరమైతే ఎన్నికల సంఘం వారిపై క్రిమినల్ కేసును కూడా  దాఖలు చేసే చాన్స్ కూడా ఉంది.  ఇక నేరం రుజువైతే బాధ్యలకు జైలు శిక్ష కూడా పడే అవకాశముంది.

READ MORE  ఒకప్పుడు ఇజ్రాయెల్ పై తటస్థంగా ఉన్న భారతదేశం ఇప్పుడు మిత్రుడిగా ఎలా నిలిచింది..? మన మద్దతు పాలస్తీనా నుంచి Israel కు ఎలా మారింది.?

MCC నిబంధనలు ఏమిటి ?

  1. MCC  అభ్యర్థల ప్రవర్తన, సమావేశాలు, ఊరేగింపులు, పోలింగ్ రోజు, పోలింగ్ బూత్‌లు, పరిశీలకులు, ఎన్నికల మ్యానిఫెస్టోలకు సంబంధించిన ఎనిమిది నిబంధనలను కలిగి ఉంది.
  2. కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే, అధికారంలో ఉన్న పార్టీ – కేంద్రంలో లేదా రాష్ట్రాల్లో – ప్రచారం కోసం తన అధికారిక పదవిని ఉపయోగించకుండా చూసుకోవాలి. అందువల్ల, ఓటర్లను  ప్రభావితం చేసే ఏ పాలసీ, ప్రాజెక్ట్ లేదా స్కీమ్ లను ప్రకటించవద్దు.  ఎన్నికలలో విజయావకాశాలను మెరుగుపరచుకోవడానికి ప్రభుత్వ ఖర్చుతో ప్రకటనలు చేయడం లేదా విజయాలపై ప్రచారం కోసం అధికారిక మాస్ మీడియాను ఉపయోగించడం నిషేధం..
  3. మంత్రులు అధికారిక పర్యటనలను ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు చేయొద్దు.  అధికారిక యంత్రాంగాన్ని ఉపయోగించవద్దని  కోడ్ చెబుతోంది. అధికార పార్టీ ప్రచారానికి ప్రభుత్వ రవాణా లేదా యంత్రాంగాన్ని ఉపయోగించకూడదు.  ఎన్నికల సమావేశాలు నిర్వహించడానికి మైదానాలు,  బహిరంగ ప్రదేశాలు  హెలిప్యాడ్‌ల వినియోగం వంటి సౌకర్యాలు అధికార,  ప్రతిపక్ష పార్టీలకు ఒకే విధంగా ఉంటాయి.
  4. వార్తాపత్రికలుచ  ఇతర మాధ్యమాలలో ప్రభుత్వ నిధులతో  ప్రకటన జారీ చేయడం కూడా నేరంగా పరిగణించబడుతుంది. పాలక ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు మొదలైన వాటిలో ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి తాత్కాలిక నియామకాలు చేయొద్దు.
  5. రాజకీయ పార్టీలు లేదా అభ్యర్థులను వారి పని రికార్డు ఆధారంగా మాత్రమే విమర్శించవచ్చు.  ఓటర్లను ఆకర్షించడానికి కుల,  మతపరమైన భావాలను ఉపయోగించకూడదు. మసీదులు, చర్చిలు, దేవాలయాలు లేదా మరే ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించకూడదు. ఓటర్లను లంచం ఇవ్వడం, బెదిరించడం లేదా వంచన చేయడం కూడా నిషేధించింది ఎన్నికల సంఘం.  పోలింగ్ ముగియడానికి నిర్ణయించిన గంట కంటే ముందు 48 గంటల వ్యవధిలో బహిరంగ సభలు, ప్రచారాలు నిర్వహించడం కూడా నిషేధించింది.  48 గంటల వ్యవధిని “election silence” అంటారు. ఓటరు తన ఓటు వేయడానికి ముందు ఎలాంటి ప్రచారాలు లేని ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడమే ఈ నిబంధనల ఉద్దేశం.
READ MORE  ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాములు ఇవే..

ఎన్నికల కోడ్ ను ఎవరు పర్యవేక్షిస్తారు..

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు ఎన్నికల సంఘం, పరిశీలకుల సహాయం తీసుకుంటుంది. ఇందుకోసం ఐఏఎస్ అధికారులు, , ఐపీఎస్ అధికారులు, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారుల సహాయం తీసుకుంటుంది. అలాగే ఈ సర్వీసుల నుంచి రిటైర్ అయిన అధికారులను కూడా ఎన్నికల పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమిస్తుంది.

నిబంధనలు ఉల్లంఘించినపుడు తర్వాత పరిణామాలు ఏమిటీ

ECI తన స్వంతంగా లేదా మరొక పార్టీ లేదా వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా Model Code of Conduct నిబంధనలు ఉల్లంఘించినవారికి  లేదా  పార్టీకి నోటీసు జారీ చేయవచ్చు. నోటీసు జారీ చేసిన తర్వాత, వ్యక్తి లేదా పార్టీ తప్పనిసరిగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలి .  తప్పును అంగీకరించడం..  బేషరతుగా క్షమాపణలు చెప్పడం లేదా ఆరోపణను తిప్పికొట్టడం వంటవి చేయొచ్చు కానీ   ఆ వ్యక్తి లేదా పార్టీ దోషిగా తేలితే, అతను/అది ECI నుంచి లిఖితపూర్వకమైన అభిశంసనను ఎదుర్కోవాల్సి ఉంటుంది.  చాలా మంది దీనిని కేవలం మణికట్టు మీద కొట్టినట్లు మాత్రమే చూస్తారు.

READ MORE  Maha Kumbh Gram Tent City | మ‌హాకుంభ‌మేళాలో సకల సౌకర్యాలతో టెంట్ సిటీ..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..