Saturday, July 19Welcome to Vandebhaarath

Indian Railways | వందేభారత్ ఎక్స్ ప్రెస్ తో శతాబ్ది, రాజధాని రైళ్లు కనుమరుగు కానున్నాయా?

Spread the love

Vande Bharat express Route | భారతీయ రైల్వేలు గంటకు 200 కి.మీ వేగంతో సుదూర ప్రయాణం కోసం రూపొందించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్లీపర్ వెర్షన్‌లను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే..  దీనివల్ల  ఇప్పటికే ఉన్న శతాబ్ది,  రాజధాని రైళ్ల స్థానంలో హై-స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే భావిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ముంబైలో వందే మెట్రో సేవలతో వందే భారత్ నెట్‌వర్క్‌ను విస్తరించే యోచనలో ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్, భారతదేశపు మొట్టమొదటి సెమీ-హై-స్పీడ్ రైలు, భారతీయ రైల్వేల అనుబంధ సంస్థ అయిన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) లో దీనిని అభివృద్ధి చేశారు.  ఈ అత్యాధునిక రైళ్లు ఫుల్ ఎయిర్ కండిషన్డ్ తో ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వేగం, సౌలభ్యం, లగ్జరీని కలిపి భారతీయ సాంకేతికత, ఇంజనీరింగ్ ప్రతిభను శిఖరాగ్రానికి చేర్చాయి. హైటెక్ సౌకర్యాలు, స్టైల్, వేగం వంటివి  ప్రయాణీకులలో ఆదరణ పొందేందుకు కారణమయ్యాయి.

శతాబ్ది, రాజధానిల స్థానంలో వందే భారత్ రైళ్లు ?

శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (shatabdi express) స్థానంలో ప్రస్తుత వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దశలవారీగా వస్తాయని పలువురు రైల్వే అధికారులు తెలిపారు. సెమీ-హై-స్పీడ్ స్వదేశీ రైలుకు సంబంధించిన స్లీపర్ వెర్షన్ ప్రస్తుత రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ ( Rajadhani express )  రైళ్లు న్యూఢిల్లీ నుంచి వివిధ రాష్ట్ర రాజధానులకు కనెక్టివిటీ ఇచ్చే భారతీయ రైల్వేల ప్రీమియంగా ఉన్నాయి.

చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) జనరల్ మేనేజర్ బిజి. మాల్యా మాట్లాడుతూ..  వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన అనేక రూట్లలో వాటి షెడ్యూల్‌లు శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌తో సరిపోలుతున్నాయని  తెలిపారు. ఆయన వ్యాఖ్యలను బట్టి శతాబ్ది రైళ్ల స్థానంలో వందేభారత్ వచ్చే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.  అయితే డిమాండ్‌కు సరిపడా వందే భారత్ రైళ్లను ఉత్పత్తి చేయడానికి సమయం పడుతుందని మాల్యా హైలైట్ చేశారు. ఈ సమయంలో శతాబ్ది రైళ్లను ఇతర మార్గాలకు తిరిగి పంపిస్తామని, ఎలాంటి వనరులు వృథా కాకుండా చూస్తామని చెప్పారు.

భవిష్యత్ అంతా ఇవే..

చైర్‌కార్‌లతో కూడిన స్వల్ప-దూరం ప్రయాణించే  వందే భారత్ రైళ్లు ఇప్పటికే పనిచేస్తుండగా, వందే భారత్ మెట్రో సేవలను ప్రవేశపెట్టడంపై చర్చలు జరుగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల మధ్య వందే మెట్రో రైళ్లను త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. ఇవి రోజువారీగా ప్రయాణాలు చేస్తే విద్యార్థులు, ఉద్యోగులకు విలువైన సేవలందించనున్నాయి.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇవే.. (Vande Bharat express Route List)

  • రాంచీ – హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • తిరునెల్వేలి – చెన్నై ఎగ్మోర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • MGR చెన్నై – విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • పాట్నా – హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • సికింద్రాబాద్ (కాచిగూడ) – బెంగళూరు (యశ్వంతపూర్) వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • రూర్కెలా – పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • కసర్ గడ్ – తిరువణంతపురం వందేభారత్ ఎక్స్ ప్రెస్ (అలప్పుజ ద్వారా)
  • ఉదయపూర్ – జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • జామ్‌నగర్ – అహ్మదాబాద్ (సబర్మతి) వందే భారత్ ఎక్స్ప్రెస్
  • ముంబై-గోవా వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • పాట్నా – రాంచీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • KSR బెంగళూరు – ధార్వాడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • రాణి కమలాపతి – జబల్పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • ఇండోర్ – భోపాల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • జోధ్‌పూర్ – సబర్మతి (అహ్మదాబాద్) వందే భారత్ ఎక్స్ప్రెస్
  • గోరఖ్‌పూర్ – లక్నో చార్‌బాగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • తిరువణంతపురం సెంట్రల్ – కసర్ గడ్ Vande Bharat (కొట్టాయం మీదుగా)
  • సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • అజ్మీర్ – ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (చండీగఢ్ వరకు పొడిగించబడింది)
  • ఢిల్లీ – డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • హజ్రత్ నిజాముద్దీన్ – రాణి కమలపాటి వందే భారత్ ఎక్స్ప్రెస్
  • న్యూఢిల్లీ – వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • న్యూఢిల్లీ – శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా (J&K) వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • న్యూఢిల్లీ – హిమాచల్ ప్రదేశ్ వందేలోని అంబ్ అందౌరా
  • చెన్నై – కోయంబత్తూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • చెన్నై – మైసూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • నాగ్‌పూర్ – బిలాస్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • న్యూ జల్పైగురి – గౌహతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • హౌరా – న్యూ జల్పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • హౌరా – పూరీ – హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • గాంధీనగర్ – ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • చెన్నై – మైసూరు వందే భారత్ స్పెషల్
  • చెన్నై సెంట్రల్ – కోయంబత్తూర్ వందే భారత్ స్పెషల్
  • డెహ్రాడూన్ – లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • అహ్మదాబాద్ – ముంబై సెంట్రల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • న్యూ జల్పైగురి – పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • పాట్నా – గోమతి నగర్, లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • విశాఖపట్నం – భువనేశ్వర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • కలబురగి నుండి బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • ముంబై సెంట్రల్ – గాంధీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • రాంచీ – వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • ఖజురహో – హజ్రత్ నిజాముద్దీన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • మైసూరు – డా. MGR సెంట్రల్ చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.
Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..