Indian Railways | వందేభారత్ ఎక్స్ ప్రెస్ తో శతాబ్ది, రాజధాని రైళ్లు కనుమరుగు కానున్నాయా?
Vande Bharat express Route | భారతీయ రైల్వేలు గంటకు 200 కి.మీ వేగంతో సుదూర ప్రయాణం కోసం రూపొందించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్లీపర్ వెర్షన్‌లను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.. దీనివల్ల ఇప్పటికే ఉన్న శతాబ్ది, రాజధాని రైళ్ల స్థానంలో హై-స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే భావిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముంబైలో వందే మెట్రో సేవలతో వందే భారత్ నెట్‌వర్క్‌ను విస్తరించే యోచనలో ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది.వందే భారత్ ఎక్స్‌ప్రెస్, భారతదేశపు మొట్టమొదటి సెమీ-హై-స్పీడ్ రైలు, భారతీయ రైల్వేల అనుబంధ సంస్థ అయిన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) లో దీనిని అభివృద్ధి చేశారు. ఈ అత్యాధునిక రైళ్లు ఫుల్ ఎయిర్ కండిషన్డ్ తో ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వేగం, సౌలభ్యం, లగ్జరీని కలిపి భారతీయ సా...