Home National Union Cabinet : అన్నదాతలకు కేంద్రం వరాలు..

Union Cabinet : అన్నదాతలకు కేంద్రం వరాలు..

0
6
Union Cabinet
PM Kisan yojana
Spread the love

Union Cabinet : కొత్త సంవత్సరం వేళ దేశంలోని రైతులకు తీపి కబురు చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ () నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ కొత్త సంవత్సరంలో మొదటి రోజు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. డీఏపీ ఎరువుపై రైతులకు అందించే సబ్సిడీని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డీఏపీపై అదనపు భారాన్ని కేంద్రమే భరించనుంది. ఇకపై 50 కిలోల డీఏపీ బస్తా రూ.1350కే లభించనుంది. కాగా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.

నాలుగు కోట్ల మందికి లబ్ధి

దేశవ్యాప్తంగా రైతుల కోసం అమలుచేస్తున్న. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన (Pradhan Mantri Fasal Bima Yojana) పొడిగించాలని కేబినెట్ తీర్మానం చేసిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రూ. 69,515 కోట్లకు పెంచినట్లు తెలిపారు. కేంద్రం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకం కింద అందించే మొత్తాన్ని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక పంట‌ల బీమా (Crop Insurance Scheme ) కోసం 50 శాతం ప్రీమియంను కేంద్రం చెల్లించేందుకు కేబినేట్ అంగీక‌రించింది.. ఈశాన్య రాష్ట్రాల‌కు ఈ ప్రీమియంను 90 శాతంగా తీర్మానించారు. అలాగే ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి రూ. 800 కోట్ల కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. సాంకేతికతను ఉపయోగించి త్వరితగతిన రైతుల పంటలకు పంట బీమా చెల్లింపు విధానానికి ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ తోడ్పడనుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.

సబ్సిడీ కింద భారీగా నిధులు

మరోవైపు డీఏపీ ఎరువుల సబ్సీడీకి రూ.3,850 కోట్లను అదనంగా కేటాయించారు. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన 2014 నాటి నుంచి 2024 డిసెంబర్ వరకు.. ఎరువుల సబ్సిడీ కింద రూ. 11.9 లక్షల కోట్లను కేంద్రం వెచ్చించింది. అలాగే 2024లో మూడోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో రైతుల కోసం రూ. 6 లక్షల కోట్ల విలువైన 23 కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రి వర్గం తీసుకుంది.

అదేవిధంగా ‘ఫండ్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ’కి కేంద్రం రూ.800 కోట్లను కేటాయించింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పలు ముఖ్యమైన ప్రాజెక్టులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందిని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణ‌వ్ ఈ సందర్భంగా వెల్లడించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here