Ugadi Panchangam 2024 | క్రోధి నామ ఉగాది పంచాంగం: ధనస్సు రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?

Ugadi Panchangam 2024 | క్రోధి నామ ఉగాది పంచాంగం: ధనస్సు రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?

Panchangam Dhanu Rashi Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం తెలుగు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో ధనస్సు రాశి  (Sagittarius Horoscope) వారికి వారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు.

  • ఆదాయము – 11
  • వ్యయము – 5
  • రాజపూజ్యము – 7
  • అగౌరవము – 1

ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి 2-05-2024 నుండి సంవత్సరాంతం వరకు షష్టమ స్థానంలో బృహస్పతి , శని తృతీయ స్థానం నందు , రాహువు చతుర్ధ స్థానం నందు, కేతువు దశమ స్థానం నందు సంచారం చేస్తున్నాడు.

READ MORE  Weekly Horoscope: ఏ రాశులవారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసా..

Ugadi Panchangam Dhanu Rashi Phalalu  : శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ధనస్సు (Sagittarius) రాశి వారికి సంతాన ఎదుగుదలను చూసి ఆనందిస్తారు. Revenue Department ఉద్యోగస్తులకు వృత్తిపరమైన ఇబ్బందులు ఉండను. బంధుమిత్రులతో వైరం అంత మంచిది కాదు. మధ్యవర్తిత్వము వల్ల లాభం చేకూరుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించును. పూర్వాషాడ నక్షత్ర జాతకులకు కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశాలు కలవు. మీ ఆలోచనలను తరచూ మార్చుకోకూడదు.

విద్యార్థులు అధిక శ్రమ చేయవలసిన సమయం. నూతన విద్యను అభ్యసించే వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. Civil ,  రవాణా శాఖ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్నవారికి అధికారుల నుంచి సమస్యలు ఉన్నప్పటికీ వృత్తిపరమైన ఎదుగుదల ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. Iron,  Plastic Industry వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. నూతన వ్యాపార ప్రారంభానికి ఈ సంవత్సరం అనుకూలము. చిన్న అనారోగ్య సమస్యలను కూడా అశ్రద్ధ చేయకూడదు. మూలా నక్షత్ర జాతకులకు కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చును. వివాహ మరియు సంతాన ప్రయత్నాలు సానుకూలము. Court కేసులు వాయిదా పడతాయి. సోదరులతో ఆస్తి పంపకాల విషయమై తగాదాలు ఏర్పడతాయి. స్త్రీలకు పొత్తి కడుపుకి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు.

READ MORE  Weekly Horoscope | వార ఫలాలు : ఈ వారం రాశి ఫలాలు.. మీ రాశి ఎలా ఉందంటే..?

క్రోధి నామ ఉగాది పంచాంగం: కర్కాటక రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి..

రాజకీయ రంగంలో ఉన్నవారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. Goverment Permissions ఆలస్యం అవుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. దంపతుల మధ్య మనస్పర్ధలు తొలుగుతాయి. ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు నడుము నొప్పి మరియు మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడతారు. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి నిరాశ ఎదురవుతుంది. శరీరానికి గాయాలు అయ్యే అవకాశం కలదు కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మొండితనంతో ఆవేశంతో కాకుండా ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకోవాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు కలవు. Bank ఉద్యోగస్తులకు స్థానచలనం కలిగే అవకాశాలు కలవు. అర్ధాష్టమ రాహువుకి,  గురువుకి జపం జరిపించి తగు దానములు ఇవ్వవలెను. గణపతి మరియు లలితా దేవి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Weekly Horoscope : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా కలిసివస్తుంది?

Astrology Signs  By

స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక

డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ

7730023250, 8978510978


Organic Forming, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

One thought on “Ugadi Panchangam 2024 | క్రోధి నామ ఉగాది పంచాంగం: ధనస్సు రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *