భూ గ్రహంపై అత్యంత భయంకరమైన జీవులలో పాములు ఒకటి. ఈ శీతల రక్త మాంసాహారులు ప్రాణ రక్షణ, ఆహారం కోసం ఇతర జీవులపై దాడి చేస్తాయి. పాములు రెచ్చగొట్టకుండా మనుషులపై దాడి చేయడం చాలా అరుదు. నిజానికి అవి మనుషులకంటే ఎక్కువగా భయపడతాయి. ఐనప్పటికీ ఇవి మానవుల ప్రాణాలను తీసిన జంతువుల్లో రెండో స్థానంలో నిలిచాయి. అయితే, కొన్ని పాములు ఇతరులకన్నా ప్రాణాంతకం, దూకుడుగా ఉంటాయి. బ్లాక్ మాంబాస్ నుంచి కింగ్ కోబ్రాస్ వరకు ప్రపంచంలోని టాప్ 10 ప్రాణాంతక పాముల గురించి తెలుసుకోవడానికి చదవండి. ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ప్రాణాంతకమైన పాముల జాబితా ఉత్తర అర్ధగోళంలో పాములు తక్కువగా ఉంటాయి. ఎడారులలో ఎక్కువగా కనిపిస్తాయి. భారతదేశం, ఆస్ట్రేలియా, ఉత్తర ఆఫ్రికా ప్రపంచంలోని చాలా ప్రమాదకరమైన, విషపూరితమైన పాములకు నిలయంగా ఉన్నాయి.
10. బ్లాక్ మాంబా Black Mamba
బ్లాక్ మాంబా ఆఫ్రికాలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన, వేగవంతమైన పాములలో ఒకటి. బ్లాక్ మాంబాలు 14 అడుగుల పొడవు వరకు
పెరుగుతాయి. గంటకు 12.5 మైళ్ల వేగంతో కదులుతాయి. పెద్దదైన పరిమాణం, చురుకుదనమే వీటిని ప్రాణాంతకమైనవిగా మార్చింది.
నల్ల మాంబాలు లేత బూడిద రంగు లేదా గోధుమ రంగు చర్మం కలిగి ఉంటాయి. అయితే వాటి నోటి లోపలి భాగం ముదురు నలుపు రంగులో ఉండడంతో వాటికి బ్లాక్ మాంబా అని
పేరు వచ్చింది. బ్లాక్ మాంబా విషం న్యూరోటాక్సిక్ స్వభావం కలిగి ఉంటుంది. చాలా త్వరగా పని చేస్తుంది. సోకిన వ్యక్తి మొదట తీవ్రమైన నొప్పిని అనుభవిస్తాడు. ఒక గంటలో కోమాలోకి వెళతాడు. విరుగుడు లభించకపోతే 6 గంటల్లోనే ప్రాణం పోతుంది.
9.బూమ్‌స్లాంగ్ Boomslang
బూమ్‌స్లాంగ్ అనేది ఆఫ్రికా ఖండం అంతటా కనిపించే పెద్ద, అత్యంత విషపూరితమైన పాము, కానీ ప్రధానంగా దక్షిణాఫ్రికా, స్వాజిలాండ్, నమీబియా, జింబాబ్వే వంటి దక్షిణ
దేశాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. పాము దాని విలక్షణమైన రూపానికి ప్రసిద్ధి చెందింది, పెద్ద కళ్ళు, ప్రకాశవంతమైన రంగులు, గుడ్డు ఆకారంలో తల ఉంటుంది. మగ బూమ్‌స్లాంగ్
సాధారణంగా నీలం లేదా నలుపు రంగు అంచులతో ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆడ పాములు తరచుగా గోధుమ రంగులో ఉంటాయి.
బూమ్‌స్లాంగ్ పాము తన విషాన్ని పిచికారీ చేయదు.. బదులుగా అది లొంగిపోయే వరకు ఎరను నమలుతుంది. బూమ్‌స్లాంగ్ విషం అనేది హెమోటాక్సిన్. ఇది ఎర్ర రక్త కణాలను
నాశనం చేస్తుంది. మరణం వరకు శరీరంలో తీవ్రమైన అంతర్గత, బాహ్య రక్తస్రావం కలిగిస్తుంది. బూమ్‌స్లాంగ్ పాము తక్కువ మోతాదులో విషాన్ని ఇంజెక్ట్ చేస్తేనే ప్రాణాపాయం తప్పుతుంది.
8. ఫెర్-డి-లాన్స్ Fer-de-Lance
ఫెర్-డి-లాన్స్ దక్షిణ అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన పాము. ఎక్కువగా అడవులలో కనిపిస్తాయి, ఫెర్-డి-లాన్స్ 4-7 అడుగుల పొడవు ఉంటుంది. ఇది అత్యంత దూకుడుగా
ఉంటుంది. ఫెర్-డి-లాన్స్ ఈటె-ఆకారపు తల, డైమండ్-ఆకారపు మచ్చలతో పొడవాటి, గోధుమ-రంగు శరీరాన్ని కలిగి ఉంటుంది. ఫెర్-డి-లాన్స్ విషం యాంటీ కోగ్యులేషన్
లక్షణాలను కలిగి ఉంది. మెదడులో రక్తస్రావం అయి మరణానికి కారణమవుతుంది. దీని విషం నిమిషాల్లోనే ప్రభావం చూపుతుంది. తరచుగా తీవ్రమైన నెక్రోసిస్‌కు దారితీస్తుంది. శరీర
కణజాలం నల్లగా మారుతుంది.
7. రస్సెల్స్ వైపర్ Russell’s Viper
రస్సెల్స్ వైపర్ భారత ఉపఖండంలో ఎక్కవగా కనిపిస్తుంది. భారతదేశంలోని పెద్ద నాలుగు పాములలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం వేలాది మంది మరణాలకు కారణమవుతుంది.
రస్సెల్ యొక్క వైపర్ ఒక గుండ్రని, మందపాటి శరీరాన్ని చిన్న తోకతో 4 నుండి 6 అడుగుల పొడవు కలిగి ఉంటుంది.
రస్సెల్స్ వైపర్ దాని నలుపు, గోధుమ రంగు కారణంగా సరిగ్గా కనిపించకుండా మట్టిలో దాగి ఉంటుంది. పొలాల్లో దాక్కున్నప్పుడు తరచుగా రైతులపై దాడి చేస్తుంది. దీని విషం అత్యంత
శక్తివంతమైనది, ఇది గ్రహం మీద అత్యంత ప్రాణాంతకమైన వైపర్‌లలో ఒకటిగా మారింది. రస్సెల్స్ వైపర్ విషానికి ఒకే కాటుతో 22 మందిని చంపే సామర్థ్యాన్ని కలిగి ఉంది. పాము
కాటు వేసిన రెండు గంటల్లోనే విషం తీవ్రమైన రక్తస్రావం, డీఫిబ్రినేషన్, రక్తస్రావం, షాక్, మూత్రపిండ వైఫల్యానికి కారణమవుతుంది.
6. ఈస్టర్ టైగర్ స్నేక్ Eastern Tiger Snake
ఈస్టర్ టైగర్ స్నేక్ ఆగ్నేయ ఆస్ట్రేలియాకు చెందినది. పసుపు, నలుపు పొలుసులతో పులిని పోలి ఉంటుంది. ఇది అన్ని పాములలో అత్యంత ప్రాణాంతకమైన విషాలలో ఒకటి. కాటు
తర్వాత కేవలం 15 నిమిషాల్లో విషాన్ని కలిగిస్తుంది. ఈస్టర్ టైగర్ స్నేక్ విషం న్యూరోటాక్సిన్ లా పని చేస్తుంది. విపరీతమైన నొప్పి, జలదరింపు, తిమ్మిరి, తరువాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, పక్షవాతం కలిగిస్తుంది.
5. సా-స్కేల్డ్ వైపర్ Saw-scaled viper
సా స్కేల్డ్ వైపర్.. దీని వల్ల మరణించిన వారి సంఖ్య పరంగా చూస్తే ఇదే అత్యంత ఘోరమైన పాము. అన్ని ఇతర పాము జాతుల కంటే ఎక్కువ మానవ మరణాలకు ఇది కారణమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సా స్కేల్డ్ వైపర్ ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, భారత ఉపఖండంలోని ప్రాంతాలలో కనిపిస్తుంది. అవి భయంకరమైన, అత్యంత దూకుడుగా ఉండే పాములలో ఒకటి. ఆ పాము తనను తాను చుట్టుకోవడం ద్వారా సిజ్లింగ్ సౌండ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సౌండ్ తోనే ఇతర జీవులను బెదిరిండంతోనే ఇవి ప్రసిద్ధి చెందాయి. సా-స్కేల్డ్ వైపర్‌లు పరిమాణంలో చిన్నవి. కాటులో తక్కువ పరిమాణంలో విషాన్ని మాత్రమే ఇంజెక్ట్ చేస్తాయి.. కానీ గంటల్లో మనిషిని చంపగలవు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఉంటుంది. ఇది ఒక్క భారతదేశంలోనే సంవత్సరానికి 5,000 మానవ మరణాలకు కారణమవుతోంది.
4. బ్యాండెడ్ క్రైట్ Banded Krait
బ్యాండెడ్ క్రైట్ అనేది ప్రపంచంలోని అత్యంత గుర్తించదగిన పాములలో ఒకటి. దాని ప్రత్యేక రూపం (పసుపు- నలుపు చారలు ) కారణంగా ఇది తరచుగా రాత్రి సమయంలో దాడి చేస్తుంది. బ్యాండెడ్ క్రైట్ పొడవుగా ఉంటుంది. పగటిపూట నెమ్మదిగా ఉంటుంది. ఇది ప్రధానంగా భారత ఉపఖండం, ఆగ్నేయాసియా, దక్షిణ చైనాలో కనిపిస్తుంది. బ్యాండెడ్ క్రైట్ చాలా ప్రాణాంతకమైన విషాన్ని కలిగి ఉంటుంది. ఇది శ్వాసకోశ కండరాలను స్తంభింపజేస్తుంది, డయాఫ్రాగమ్ కదలకుండా చేస్తుంది. ఊపిరాడకుండా మరణించేలా చేస్తుంది.
3. కింగ్ కోబ్రా King Cobra
పాము అంటేనే కింగ్ కోబ్రా గుర్తుకు వస్తుంది. ఇది దక్షిణ ఆసియాకు చెందినది, కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. కింగ్ కోబ్రా కాటు చాలా శక్తివంతమైనది. అది కొన్ని గంటల్లోనే ఏనుగునైనా చంపగలదు. ఇది 18 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. దీనిని రెచ్చగొట్టినప్పడుదాని తలను నేల నుంచి చాలా అడుగుల ఎత్తుకు ఎత్తగలదు. ఒకే కింగ్ కోబ్రా కాటు మానవుడిని 15 నిమిషాల్లో చంపగలదు. పాము 7 మిల్లీలీటర్ల విషాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా త్వరితగతిన అనేకసార్లు కాటుకు ప్రసిద్ధి చెందింది. జంతు రాజ్యంలో తమ సొంత జాతి జీవులను తినే అతికొద్ది జీవులలో కింగ్ కోబ్రా ఒకటి.
2. కోస్గల్ తైపాన్ Coastal Taipan
కోస్గల్ తైపాన్ ఆస్ట్రేలియన్ అవుట్‌బ్యాక్‌లో కనిపించే మరొక ఘోరమైన పాము. ఇది అద్భుతమైన వేగానికి చురుకుదనానికి ప్రసిద్ధి చెందింది. కోస్గల్ తైపాన్ బాధితుడిని ప్రతిస్పందించకముందే చాలాసార్లు కాటేస్తుంది. ఉసిగొల్పకుండానే దాడి చేయడంలో ముందుంటుంది. ఇది లేత ఆలివ్ నుంచి ముదురు గోధుమ రంగు వరకు రంగు ఉంటుంది. ఎర్రటి కళ్ళు కలిగి ఉంటుంది. ఇది పొడవైన,
సన్నని శరీరాన్ని కలిగి ఉంటుంది.
1. ఇన్ లాండ్ తైపాన్ Inland Taipan
ఇన్ లాండ్ తైపాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన, అత్యంత విషపూరితమైన పాము. ఆస్ట్రేలియాలో కనుగొనబడిన, ఇన్ లాండ్ తైపాన్ ముదురు అంచుగల పొలుసులతో ముదురు తాన్ రంగులో ఉంటుంది. ఇది అన్ని పాములలో అత్యంత విషపూరితమైన విషాన్ని కలిగి ఉంటుంది. ఇన్ లాండ్ తైపాన్ విషం ఒకే కాటులో 100 మందిని చంపే శక్తిని కలిగి ఉంది. కాటువేసిన కొన్ని కొన్ని నిమిషాల్లోనే దాని ప్రభావం కనిపిస్తుంది. ఒక గంటలోపు బాధితుడిని చంపవచ్చు. ఇన్ లాండ్ తైపాన్ ఒక ఉగ్రమైన పాము కాదు.. మానవుల పట్ల జాగ్రత్తగా, భయంగా ప్రవర్తిస్తుంది. కానీ దానిని రెచ్చగొట్టినపుడు మాత్రం షాకింగ్ వేగంతో దాడి చేస్తుంది.
పాములు – అవి నివసించే ప్రాంతాలు
బ్లాక్ మాంబా – సబ్ -సహారా, దక్షిణ ఆఫ్రికా
బూమ్‌స్లాంగ్ – సబ్-సహారా ఆఫ్రికా
ఫెర్-డి-లాన్స్ – దక్షిణ అమెరికా
రస్సెల్స్ వైపర్ – భారతదేశం, ఆగ్నేయ ఆసియా
ఈస్టర్న్ టైగర్ స్నేక్ – ఆస్ట్రేలియా
సా-స్కేల్డ్ వైపర్ – భారత ఉపఖండం
బ్యాండ్డ్ క్రైట్ – దక్షిణ ఆసియా
కింగ్ కోబ్రా – భారతదేశం, దక్షిణ ఆసియా
కోస్టల్ తైపాన్ – ఆస్ట్రేలియా
ఇన్ లాండ్ తైపాన్ – ఆస్ట్రేలియా