ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాములు ఇవే..
భూ గ్రహంపై అత్యంత భయంకరమైన జీవులలో పాములు ఒకటి. ఈ శీతల రక్త మాంసాహారులు ప్రాణ రక్షణ, ఆహారం కోసం ఇతర జీవులపై దాడి చేస్తాయి. పాములు రెచ్చగొట్టకుండా మనుషులపై దాడి చేయడం చాలా అరుదు. నిజానికి అవి మనుషులకంటే ఎక్కువగా భయపడతాయి. ఐనప్పటికీ ఇవి మానవుల ప్రాణాలను తీసిన జంతువుల్లో రెండో స్థానంలో నిలిచాయి. అయితే, కొన్ని పాములు ఇతరులకన్నా ప్రాణాంతకం, దూకుడుగా ఉంటాయి. బ్లాక్ మాంబాస్ నుంచి కింగ్ కోబ్రాస్ వరకు ప్రపంచంలోని టాప్ 10 ప్రాణాంతక పాముల గురించి తెలుసుకోవడానికి చదవండి. ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ప్రాణాంతకమైన పాముల జాబితా ఉత్తర అర్ధగోళంలో పాములు తక్కువగా ఉంటాయి. ఎడారులలో ఎక్కువగా కనిపిస్తాయి. భారతదేశం, ఆస్ట్రేలియా, ఉత్తర ఆఫ్రికా ప్రపంచంలోని చాలా ప్రమాదకరమైన, విషపూరితమైన పాములకు నిలయంగా ఉన్నాయి.
10. బ్లాక్ మాంబా Black Mambaబ్లాక్ మాంబా ఆఫ్రికాలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది ప్...