Saturday, April 18, 2026
Career

TG Group 4 Results | గ్రూప్-4 తుది ఫలితాల విడుదల

Spread the love

TG Group 4 Results |  గ్రూప్-4 తుది ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్- 4కు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజినల్ లిస్ట్‎ను నవంబర్ 14న గురువారం సాయంత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రిలీజ్ చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం టీజీపీఎస్సీ అధికారిక https://www.tspsc.gov.in/ వెబ్‌ సైట్‌‎ను సంప్రదించాలని.. ఏమైనా సమస్యలు ఉంటే అధికారులను సంప్రదించాలని అభ్యర్థులకు కమిషన్ సూచించింది.

8,180 గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీ 2022 డిసెంబర్‌ 1వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. 2023 జూలై 1న గ్రూప్ 4 పరీక్షను టీజీపీఎస్సీ నిర్వహించింది. రిటన్ టెస్ట్‎లో క్వాలిఫై అభ్యర్థులను ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్‎కు ఎంపిక చేసింది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం 8,084 మంది అభ్యర్థులను గ్రూప్ 4 ఉద్యోగానికి టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. ఈ మేరకు గ్రూప్ 4 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్‌ జాబితాను గురువారం టీజీపీఎస్సీ విడుదల చేసింది. 8,180 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు 8,084 ఉద్యోగాలకు మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేశారు. కాగా  మరో 96 పోస్టులను భర్తీ చేయకుండా పెండింగ్‎లో పెట్టారు.

 

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *